BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (03/10/2025) ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి                                                                                    

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (03/10/2025) ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి                                                                                    

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి:

సన్నిహితుల నుండి అందిన  ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి  ఉపశమనం కలుగుతుంది.


మిథున రాశి:  

ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటక రాశి:

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం ఉండదు. సోదరులతో ఆస్తి వివాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

సింహరాశి:

వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఇంటాబయటా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.  ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్యారాశి :

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడ గలుగుతారు. దూరపు  బంధువులను కలుసుకుని వివాహ విషయమై చర్చ చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన  పనుల్లో ఆటంకాలు ఉంటాయి.  ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికరాశి:

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల  ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన  పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.

ధనస్సు రాశి:

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాల విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. బంధు మిత్రులతో ఇంట్లో మరింత ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

మకరరాశి:

కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన  పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి.

కుంభరాశి:

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి.

మీనరాశి:

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/10/2025) ఆ రాశి ఉద్యోగులు శుభవార్తలు వింటారు – వారికి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి                 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/10/2025)                 

Dussehra 2025: దసరా నుంచి.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం !

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/09/2025)                

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/09/2025)                

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 – అక్టోబర్‌ 04)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/09/2025)               

Big Stories

×