OTT Movie : కోరి నెత్తి మీదకి కొరివి తెచ్చుకోవడం అంటే ‘క్లోయ్’ అనే హాలీవుడ్ సినిమా చుస్తే బాగా అర్థం అవుతుంది. ఈ సినిమాలో భర్త మీద అనుమానంతో, భార్య ఒక వేశ్యను పంపి టెస్ట్ చేస్తుంది. అయితే ఆతరువాత కథ మసాలా ఘాటుతో మెంటలెక్కిస్తుంది. థిల్లర్ ఎలిమెంట్స్ , రొమాంటిక్ సీన్స్ తో ఈ సినిమా హీట్ పుట్టిస్తుంది. ఈ సినిమాని ఒంటరిగా చూస్తేనే మంచిది. ఫ్యామిలీతో అస్సలు చూడలేము. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘క్లోయ్’ 2009లో వచ్చిన ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా. అటామ్ ఎగోయాన్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇందులో జూలియన్ మూర్ (క్యాథరిన్), లియామ్ నీసన్ (డేవిడ్), అమండా సెయ్‌ఫ్రైడ్ (క్లోయ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2009 సెప్టెంబర్ 13న విడుదలైంది. 1 గంట 36 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా, IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
క్యాథరిన్ అనే మహిళా టొరంటోలో ఒక గైనకాలజిస్ట్. ఆమె హస్బెండ్ డేవిడ్ ఒక మ్యూజిక్ ప్రొఫెసర్. వాళ్ళకి మైఖేల్ అనే ఒక టీనేజ్ కొడుకు ఉన్నాడు. క్యాథరిన్, డేవిడ్ మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంటుంది. కానీ డేవిడ్ ఫ్లర్టీ బిహేవియర్ వల్ల క్యాథరిన్‌కి అతని మీద డౌట్స్ వస్తాయి. డేవిడ్ తన బర్త్‌డే పార్టీలో ఒక యంగ్ స్టూడెంట్‌తో ఫ్లర్ట్ చేస్తాడు. ఆమె ఫోన్ నంబర్ కూడా తీసుకుంటాడు. ఆ తరువాత క్యాథరిన్ డేవిడ్ ఫోన్‌లో ఒక టెక్స్ట్ చూస్తుంది. అతను చీటింగ్ చేస్తున్నాడేమోనని అనుమానిస్తుంది. ఒక రోజు క్యాథరిన్ క్లోయ్ అనే యంగ్, సెక్సీ ఎస్కార్ట్‌ని రెస్టారెంట్‌లో మీట్ అవుతుంది. ఆమెతో కలసి క్యాథరిన్ ఒక ప్లాన్ వేస్తుంది. క్లోయ్ ను ఉపయోగించి, డేవిడ్‌ని టెస్ట్ చేయాలని అనుకుంటుంది. అతను చీట్ చేస్తున్నాడా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటుంది.
ఇప్పటి నుంచి డేవిడ్‌ని క్లోయ్ సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. క్యాథరిన్‌కి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తుంది. క్లోయ్ ఆమెకు చాలా విషయాలు చెప్తుంది. డేవిడ్ తనతో ఫ్లర్ట్ చేశాడని, హోటల్‌కి తీసుకెళ్లాడని, ఆ పని కూడా జరిగిపోయిందని చెప్పగానే, క్యాథరిన్ షాక్ అవుతుంది. ఇది తెలుసుకుని డేవిడ్‌తో క్యాథరిన్ గొడవపడుతుంది. కానీ క్లోయ్ కథలు కొంచెం ఎక్సాజరేటెడ్‌గా ఉంటాయి. క్యాథరిన్‌కి ఎందుకనో ఆమె మీద డౌట్ వస్తుంది. అసలు విషయం తెలుసుకోవడానికి, క్లోయ్ క్యాథరిన్‌తో ఎక్కువ క్లోజ్ అవుతుంది. అయితే ఆమెతో ఎమోషనల్, సెక్సువల్ రిలేషన్ స్టార్ట్ చేస్తుంది. క్యాథరిన్ మొదట వద్దనుకుంటూనే, క్లోయ్ కి లొంగిపోతుంది. క్యాథరిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆమె డేవిడ్‌ని లవ్ చేస్తుందా, క్లోయ్‌తో అట్రాక్ట్ అయిందా? అనే సందేహంలో పడుతుంది.
క్లోయ్ క్యాథరిన్ ఫ్యామిలీ లైఫ్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. క్లోయ్ క్యాథరిన్ కొడుకు మైఖేల్ తో కూడా క్లోజ్ అవుతుంది. అతన్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది గమనించిన క్యాథరిన్‌కి, క్లోయ్ డేంజరస్ అని అనిపిస్తుంది. తన భర్త మీద కూడా అబద్దాలు చెప్పినట్లు తెలుసుకుంటుంది. ఇక ఆమెతో రిలేషన్ కట్ చేయాలని డిసైడ్ అవుతుంది. కానీ క్లోయ్ క్యాథరిన్ ఫ్యామిలీని బ్రేక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. క్లైమాక్స్‌లో ఈ కథ ఊహించని మలుపు తీసుకుంటుంది. క్యాథరిన్ ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తుంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే