Kurnool News: దసరా పండుగ రోజు ప్రతీ ఏటా జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవం రక్తసిక్తంగా మారింది. సంప్రదాయం పేరిట జరిగిన కర్రల సమరం హింసాత్మకంగా మారింది. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘర్షణలో మరో వంద మందికి పైగా భక్తులకు తీవ్ గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
హింసాత్మకంగా దేవరగట్టు సమరం
కర్నూలు జిల్లాలో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు హొళగుంద మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవం జరుగుతుంది. గురువారం రాత్రి జరిగిన బన్నీ ఉత్సవం కాస్త రక్తసిక్తంగా మారింది. అర్ధరాత్రి అమ్మవారి వివాహం తర్వాత ఊరేగింపు మొదలైంది. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ కాస్త సమరంగా మారింది.
దేవతామూర్తులను తమ ప్రాంతానికే తీసుకెళ్లాలని రెండు వర్గాలు కర్రలతో ఘర్షణ మొదలైంది. రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకున్నారు. ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా భక్తులు గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ట్రీట్‌మెంట్ కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముగ్గురు భక్తులు మృతి, 100 మందికి గాయాలు
ఉత్సవంలో వ్యక్తులు మరణించిన విషయం తెలియగానే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహా ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బన్ని జైత్రయాత్రలో 24 గ్రామాల ప్రజలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొంతమంది వ్యక్తులు కాగడాలు, దివిటీలు విసురుతూ వీరంగం సృష్టించారు.
ALSO READ: పన్నుల రాబడిలో పరుగులు తీస్తున్న ఏపీ
కర్నూలులో శతాబ్దాల నాటిది ఈ బన్నీ ఉత్సవం. భక్తి- ప్రమాదాన్ని మిళితం చేస్తోంది. ప్రతి సంవత్సరం దసరా రోజు రాత్రి ఈ ఉత్సవం జరుగుతుంది. భక్తులు పదే పదే గాయాలయినప్పటికీ గ్రామస్తులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. సంప్రదాయాన్ని నిలబెట్టడానికి కర్రలతో ఘర్షణకు దిగుతున్నారు.
బన్నీ జైత్రయాత్రలో అల్లర్లు జరగకుండా పోలీసుల ప్రేక్షక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. దేవరగట్టులో మాల మల్లేశ్వరస్వామిని సొంతం చేసుకునేందుకు నెరణికి-నెరణికితండా-కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వర్గంగా ఏర్పడుతారు.
అరికెర-సుళువాయి-ఎల్లార్తి సహా ఏడు గ్రామాల భక్తులు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో రక్తం చిందేలా కొట్టుకుంటారు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఉత్సవంలో వందల మంది గాయపడుతున్నారు. ఆచారం మాత్రం కంటిన్యూ అవుతోంది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హింస కొనసాగుతోంది. మృతి చెందినవారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరోవైపు గాయపడిన క్రమంగా కోలుకుంటున్నారు.
దేవరగట్టు బన్ని జైత్ర యాత్రలో చెలరేగిన హింస
రెండు వర్గాలు కర్రలతో తలపడడంతో ముగ్గురు మృతి.. 100 మందికి గాయాలు
భక్తులతో కిక్కిరిసిన దేవరగట్టు అటవీ ప్రాంతం
కర్రలతో బన్ని జైత్రయాత్రలో పాల్గొన్న 24 గ్రామాల ప్రజలు
కాగడాలు, దివిటీలు విసురుతూ కొంత మంది వీరంగం
గాయపడినవారిని ఆదోని… https://t.co/XREIgBHC7a pic.twitter.com/0JFM5XWPoz
— BIG TV Breaking News (@bigtvtelugu) October 3, 2025