E-Paper
Advertisement

Temple Bells : గుడిలో గంట నిజం చెప్పే నిజం ఇదేనా…?

Temple Bells : గుడిలో గంట నిజం చెప్పే నిజం ఇదేనా…?
Advertisement

Temple Bells : గుడిలో గంట మోగించడం సనాతనంగా వస్తున్న సంప్రదాయం. నైవేద్యం పెట్టేటప్పుడు, మేలుకొలుపు పాడేటప్పుడు, ఆలయం మూసేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతారు. హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడం అంటే దేవతల్ని ఆహ్వానించడమే. ఏదేవునికి హారతి ఇస్తున్నామో…ఆ దేవుడి మహాదైవాంశతో విగ్రహంలో చేరాలని చూపటమే గంట శబ్ధం పరామర్థం. ఆ సమయంలో దేవుడ్ని ప్రత్యక్షంగా చూసినట్టే అవుతుంది. భగవంతుడికి ఇచ్చే హారతి దివ్య జ్యోతిగా ప్రజ్వలిస్తుంది. మనం గంట కొట్టినప్పుడు వచ్చే నాదం… దివ్య నాదంగా మారుతుందట. ఆ హారతి వెలుగుల్లో స్వామి దివ్య దర్శని చూస్తే… భక్తుల మనుసులో ఎనలేని ఆనందం కల్గుతుంది. అంతే కాకుండా ఏదైనా సాధించగలమనే నమ్మకం కూడా వస్తుంది. అంతే కాకుండా చాలా మంది భక్తులు కోరిన కోరిక తీరిస్తే.. గుడిలో గంటలు కడతామని మొక్కుతుంటారు.

రాక్షసులను తరిమి కొట్టి.. దేవతలను ఆహ్వానించేందుకే సంకేతంగానే గంట కొడుతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందుకే గుడిలోకి వెళ్లగానే గంట కొట్టి స్వామి వారిని ఆహ్వానిస్తుంటాం. ఆ తర్వాతే దైవ దర్శనం చేసుకోవాలి. హారతి సమయంలో కూడా అందుకే గంట కొడుతుంటారని వేద పండితులు చెబుతున్నారు. అందుకే చాలా ఆలయాల్లో ఒకటి రెండు కాకుండా చాలా గంటలు ఉంటాయి. అలాగే చిన్న పిల్లలకు త్వరగా మాటలు రాకపోయినా… మాటలు వస్తే గంటలు కడతామని మొక్కతారు.

Advertisement

దేవతలను రమ్మని మేల్కొల్పేందుకు ఆలయాల్లో ఈ గంటలు ఉంటాయి. గుడికి వెళ్లిన ప్రతీ ఒక్క భక్తుడు గంట కొట్టి ఆ దేవుడిని పిలుస్తాడు. ఆ తర్వాతే దర్శనం చేసుకుంటాడు. ఇలా దైవ దర్శనానికి వెళ్లిన వారందరూ మర్చిపోకుండా గుడి గంటను ఒక్క సారి అయినా సరే కొట్టాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ బాధలు విని మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×