Illu Illalu Pillalu Today Episode October 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు వేదవతి పై సీరియస్ అవుతాడు. కోడల్ని కంట్రోల్లో పెట్టుకుని అత్తగా నువ్వు మిగిలిపోయావు బుజ్జమ్మ అంటూ అరుస్తాడు. కోడళ్లను పెట్టమంటే నువ్వేమైనా పెట్టావా.. అసలు నీ మాటని లెక్క చేసారా అని రామరాజు అడుగుతాడు. ఎంత చెప్పినా సరే నీకు ఈ జన్మకి బుద్ధి రాదు కదా బుజ్జమ్మ అని రామరాజు పేదవతికి క్లాస్ పీకుతాడు. మీరే కదండీ కోడళ్ళని కూతురు లాగా చూసుకోవాలి అని అన్నారు అందుకే బాగా చూసుకుంటున్నాను అని వేదవతి అంటుంది.. భాగ్యం తన కొడుకు దగ్గర డబ్బులు తీసుకున్న రామరాజు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా ధీరజ్ వాళ్ళ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడానికి డ్రెస్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ధీరజ్ మాత్రం ప్రేమను చూస్తూ ఉండిపోతాడు. అక్కడికి వచ్చిన వేదవతి ఏం చేస్తున్నారో గవర్నమెంట్ కోడలు గారు అని అడుగుతుంది. ప్రేమ ధీరజ్ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీకి వెళ్లడానికి డ్రెస్సెస్ సెలెక్ట్ చేయమని చెప్పింది అందుకే అది చేస్తున్నాను అత్తయ్య అని నర్మదా అంటుంది. వేదవతి డ్రెస్సులు సెలెక్ట్ చేయాలంటే నా హ్యాండ్ కూడా ఉండాల్సిందే అనేసి అంటుంది. జీన్స్ టీ షర్టు అని నర్మదా అంటే అది కంఫర్ట్ గా లేదని ప్రేమ అంటుంది.
మినీ స్కట్ ఎలా ఉంటుంది అని నర్మదా అంటుంది. ఛీ.. ఛీ ఇలాంటి డ్రెస్సులు వేస్తే మీ మావయ్య గనక చూస్తే కోడలికి భయం పెట్టట్లేదని నన్నరుస్తాడు అసలు వద్దు అని అంటుంది వేదవతి. మీ ట్రెండ్ కు మా ట్రెండ్ కు తగ్గట్లు లంగా హోణి వేస్తే బాగుంటుందని వేదవతి అంటుంది. లంగా వోణీలు ప్రేమ అందంగా ఉంది అని నర్మదా వేదవతి ఇద్దరి ఫిక్స్ అయిపోతారు. ఇది చాలా బాగుంది అని వెదవతి తెగ పొగిడేస్తూ ఉంటుంది.
ధీరజ్ పార్టీకి టైం అవుతుంది ప్రేమ ఎక్కడుందో ఇంకా అర్థం కావట్లేదు అని అరుస్తూ ఉంటాడు. ప్రేమ లంగా హోణిలో అలా నడుచుకుంటూ రావడం చూసిన ధీరజ్ ఆమె అందానికి ఫిదా అయిపోతాడు.. అయితే ప్రేమ ఇంత అందంగా రెడీ అయితది కనీసం ఒక్కసారి చూసి ఎలా ఉందో చెప్పొచ్చు కదా అనుకుంటుంది. పార్టీకి టైం అవుతుంది ఇంకా వెళ్దామని ధీరజ్ అంటాడు. కానీ ప్రేమ మాత్రం నీకోసం ఇంతగా రెడీ అయ్యి ఎలా ఉన్నానో అని అడుగుతుంటే ఒక్కసారి చెప్పడానికి నీకు ఏంటి నీ మనసులో అనుకుంటుంది.
కాస్త ముందుకు వెళ్లిన ధీరజ్ మళ్లీ వెనక్కి వచ్చి ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. ఆ మాట వినగానే ప్రేమ ఫిదా అవుతుంది.. ఇద్దరూ కలిసి సరదాగా పార్టీకి వెళ్తారు. అక్కడ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ధీరజ్ ప్రేమ గురించి చెప్తాడు. వీళ్ళిద్దరూ సంతోషంగా వెళ్లడం చూసిన నర్మదా ఎప్పటికీ వీళ్లిద్దరూ ఇలాగే సంతోషంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత వేదవది నర్మదని నీ చెల్లెలు సంతోషం గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదా అని చురకలంటిస్తుంది.
అసలు ప్రేమ ఫోటోలు గురించి మా పుట్టింటి వాళ్లకి ఎవరు చెప్పారు తెలుసుకోవాలి అని వేదవతి అంటుంది. కచ్చితంగా ఇది వల్లి అక్క పని అని నర్మదా అనుకుంటుంది. అయితే ఈ విషయం గురించి కచ్చితంగా తేల్చుకోవాలి అని నర్మదా గట్టిగా నిర్ణయించుకుంటుంది. సరే ఎలాగైనా కొద్ది రోజుల్లో ఈ విషయాన్ని బయట పెట్టాలని అనుకుంటుంది. ఇక ప్రేమ పార్టీకి వెళ్లి సంతోషంగా ఉంటుంది. ధీరజ్ ఫ్రెండ్ ఐశ్వర్య నీకోసం వెతుకుతుంది రా అని అంటాడు. ఐశ్వర్య వచ్చిందా ఎక్కడుంది అని ధీరజ్ కూడా అడగడంతో ప్రేమ కుళ్లుకుంటుంది.
Also Read : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవి మిస్ చేయొద్దు..
వీరిద్దరి మధ్య ఐశ్వర్య ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఎంట్రీ తో ప్రేమ షాక్ అవుతుంది. ఐశ్వర్య వచ్చి రాకతలికి ధీరజ్ని హగ్ చేసుకుని మరి నీ కోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అంటుంది. మాట వినగానే ప్రేమ షాక్ అవుతుంది. వీరిద్దరూ కలిసి రొమాంటిక్ డాన్స్ వేస్తారు అది చూసిన ఐశ్వర్య కుళ్ళుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..