BigTV English

Sun Ketu Conjunction: సూర్యుడు, కేతువుల కలయిక.. ఇక నుంచి వీరి జీవితానికి తిరుగులేదు

Sun Ketu Conjunction: సూర్యుడు, కేతువుల కలయిక.. ఇక నుంచి వీరి జీవితానికి తిరుగులేదు

Sun Ketu Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు శక్తి, ఆత్మ విశ్వాసం, గౌరవానికి కారకాలుగా చెబుతుంటారు. అదే సమయంలో నీడ గ్రహం కేతువు వ్యక్తికి కీర్తిని ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. ప్రస్తుతం సూర్యుడు, కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు నెలలో సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. గ్రహాల రాజు సూర్యుడు సెప్టెంబర్ నెలలో కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు.


కేతువు గతేడాది నుంచి కన్యా రాశిలో సంచరిస్తోంది. సెప్టెంబర్ 16 నుంచి సూర్యుడు కన్యా రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. నెల రోజుల పాటు ఆ రాశిలోనే ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కన్యా రాశిలో సూర్యుడు, కేతువుల కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడనుంది. గ్రహణ యోగం శుభప్రదంగా పరిగణించరు. అయితే సూర్య, కేతువుల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
సూర్యుడు, కేతువుల కలయిక వృషభ రాశి వారి జీవితంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకుని వస్తుంది. మీరు చేసే పనిలో గొప్ప విజయాలను పొందే అవకాశం ఉంది. విదేశాల్లో చదవాలనే కోరిక నెరవేరుతుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సామాజిక హోదా, ప్రతిష్ట పెరిగే అవకాశాలున్నాయి. సూర్యుడు, కేతువలు కలయిక వల్ల ఈ సమయంలో వృత్తికి సంబంధించిన శుభవార్తలు అందుకుంటారు.
సింహ రాశి:
సింహరాశికి అధిపతి సూర్యుడు అందువల్ల మీకు సూర్యుడు, కేతువుల కలయిక వ్యాపారంలోని లాభాలను కలిగిస్తుంది. వ్యాపారంలో వృద్ధికి సంబంధించిన అనేక అంశాలు ఈ సమయంలో పెరుగుతాయి. సంపద, సంతోషం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి సంబంధిత విషయాలు కూడా మీకు ఉపశమనం కలిగిస్తాయి. కోర్టు కేసులో మీరు విజయం సాధిస్తారు. మీ ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని విధంగా పురోగతి సాధిస్తారు.
వృశ్చిక రాశి:
సూర్య, కేతువుల కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఫలితంగా వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు భౌతిక సుఖాలను అనుభవించేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీకు అదృష్టం పూర్తిగా కలిసివస్తుంది. ఆకస్మిక డబ్బు ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆనందం కూడాపెరుగుతుంది.

Also Read: శని సంచారం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ !


ధనస్సు రాశి:
సూర్య, కేతువుల కలయిక ధనస్సు రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతారు. కెరీర్ లో కొత్త శిఖరాలను అందుకునే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు.

Related News

Pitru Paksha 2025: పితృ పక్షంలో చనిపోయిన వారికి.. పిండ ప్రదానం ఎందుకు చేయాలి ?

Eclipse: గ్రహణం రోజు ఏం చేయాలి ? ఏం చేయకూడదో తెలుసా ?

Peepal Tree: ఇంటి గోడపై రావి చెట్టు పెరగడం శుభమా ? అశుభమా ?

Tulsi Plant: వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఏ దిశలో నాటాలి ?

Ganesh Immersion: మీరు ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేస్తున్నారా ? ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోండి

Cats Scarified: 4 ఆలయాలు.. 4 పిల్లులు బలి.. ఆ గ్రామానికి అరిష్టమా?

Big Stories

×