SC Pulls up Centre: పెన్షన్ చెల్లింపు విషయంలో ఆలస్యం చేసిన కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. భారీగా జరిమానా విధించింది. భారత సైన్యంలో రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్ కు సంబంధించి కేంద్రం ఓ నిర్ణయం తీసుకోకపోవడంపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ పథకం ప్రకారం పెన్షన్ చెల్లించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నది. ఈ ప్రక్రియలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందంటూ న్యాయస్థానం మండిపడింది. ఈ క్రమంలో కేంద్రానికి రూ. 2 లక్షల జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది.
Also Read: పార్టీ వద్దని వారించినా.. మళ్లీ అదే వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం
అంతేకాదు.. ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమంటూ పేర్కొన్నది. నవంబర్ 14 లోగా సమస్యను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లేదంటే పెన్షన్ పెంపు విషయమై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందంటూ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది.