Shani Transit: నవగ్రహాల్లో శనిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. శని మనిషి కర్మను బట్టి ఫలాలను అందిస్తాడు. సాడే సాతి కారకుడు కూడా శని మాత్రమే. ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఒక్కసారైనా శని ఆగ్రహానికి గురవుతుంటాడు. శని నక్షత్ర మార్పు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కొందరికి అశుభ ప్రభావాలు కూడా భరించవలసి ఉంటుంది. మరికొందరికి శని శుభ ప్రభావాలను ఇస్తుంటాడు. శని అక్టోబర్ 3 న నక్షత్రం మారి రాహువు నక్షత్రం అయిన శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు.
రాహువు పాప గ్రహంగా పరిగణిస్తే శనిని క్రూర గ్రహంగా చెబుతారు. పంచాంగం ప్రకారం శని గ్రహం అక్టోబర్ 3వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించి డిసెంబర్ 27 వరకు ఈ నక్షత్రం లోనే ఉంటాడు. శని గ్రహం శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మరికొందరు జాగ్రత్తగా ఉండటం మంచిది. శని నక్షత్ర మార్పు ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం
వృషభ రాశి:
శని శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు తమ కెరీర్ పరంగా లాభాలను పొందుతారు. వృత్తి జీవితంలో గొప్ప విజయంతో పాటు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఈ కాలంలో విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. మీరు విదేశాలకు వెళ్లాలని కలలు కన్నట్లయితే అది కచ్చితంగా నెరవేరుతుంది. అంతేకాకుండా విదేశాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశముంది. ఈ సమయంలో విదేశాల్లో వ్యాపారం చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
ధనస్సు రాశి:ఈ రాశి వారికి శని నక్షత్ర మార్పు వల్ల భౌతిక సుఖం కలుగుతుంది. కెరీర్ పరంగా లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. మీరు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా పొందుతారు. ఉద్యోగంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు మీసహోద్యోగులతో మంచి సంబంధాలను పెంచుకుంటారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో కూడా అధిక లాభాలు పొందే అవకాశముంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ జీవితం కూడా చక్కగా సాగుతుంది. ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది.
మేష రాశి:
రాహు నక్షత్రంలోకి శని సంచరించడం వల్ల మేష రాశి వారికి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు చాలా కాలంగా పూర్తి చేయాలనుకున్న పని పూర్తి అవుతుంది.ఈ కాలంలో మీ దగ్గర రుణం తీసుకున్న వ్యక్తులు డబ్బును మీకు తిరిగి ఇస్తారు. మీ జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కూడా లాభపడతారు. మీరు కెరీర్ పరంగా సంతృప్తి చెందే అవకాశం ఉంది. మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా తీరుతాయి. ప్రతి సవాల్‌ను ఎదుర్కునేందుకు మీకు సహాయం చేసేందుకు మీకు సంబంధింయిన వారు ముందుకు వస్తారు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక పనుల పట్ల కూడా ఎక్కువగా మొగ్గుచూపుతారు. అంతే కాకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.