Ram Pothineni: రామ్ పోతినేని ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రామ్ సక్సెస్ఫుల్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ కెరియర్ లో సరైన హిట్ సినిమా పడలేదు.
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి సంబంధించి విడుదలైన కంటెంట్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మహేష్ మంచి సక్సెస్ అందుకున్నాడు. అంత సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సాధారణంగానే అంచనాలు ఉండటం అనేది జరుగుతుంది. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన భాగ్యశ్రీ నటిస్తోంది.
మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ భాగ్యశ్రీ కి మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే ప్రస్తుతం రాంబోతునేని భాగ్యశ్రీ తో ప్రేమలో పడ్డాడు అని చాలా కథనాలు వినిపించాయి. అలానే వీళ్లకు సంబంధించిన ఇంస్టాగ్రామ్ పోస్టులు కూడా బాగా వైరల్ అయ్యాయి.
అయితే రామ్ నిజంగానే భాగ్యశ్రీ తో ప్రేమలో ఉన్నాడని, అందుకే అద్భుతమైన సాహిత్యం తో పాటలు రాస్తున్నాడు అని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సినిమాలో ఒక పాటను రాసిన రామ్ తాజాగా ఒక పాటను కూడా పాడాడు. రామ్ పాడిన పాట ఇప్పుడు విడుదలైంది. చాలా ఎనర్జిటిక్ గా ఆ సాంగ్ పాడాడు. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. దీనిని బట్టి చూస్తుంటే ప్రేమలో పడ్డాడు కాబట్టి పాటలు రాయడం పాటలు పాడడమే కాదు ఇంకేం చేస్తాడో అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.