BigTV English

Chiranjeevi : భారీ ధరకు అమ్ముడుపోయిన మెగా 157 ఓటీటీ హక్కులు.. అక్కడే స్ట్రీమింగ్!

Chiranjeevi : భారీ ధరకు అమ్ముడుపోయిన మెగా 157 ఓటీటీ హక్కులు.. అక్కడే స్ట్రీమింగ్!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏడు పదుల వయసులో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Vassistha mallidi) దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ కు వాయిదా వేశారు. మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రముఖ సీనియర్ హీరోయిన్ నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. ప్రముఖ స్టార్ హీరో వెంకటేష్ (Venkatesh ) కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


భారీ ధరకు ఓటీటీ హక్కులు..

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అభిమానులలో అంచనాలు పెంచేసింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. విడుదలకు ఇంకా నాలుగు నెలలు సమయం ఉండగానే ఇప్పుడు భారీ ధరకు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఏది ఏమైనా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా కావడంతో బిజినెస్ పరంగా కూడా రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి ఆఫర్లు వస్తూ ఉండడం గమనార్హం.

నయనతార – చిరంజీవిపై బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరణ..


ఇకపోతే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. అనిల్ రావిపూడి తాజాగా నయనతార, చిరంజీవిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపటి నుండి వీరిద్దరిపై ఒక అందమైన పాటను హైదరాబాదులో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అందిస్తూ ఉండగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా విశేషాలు..

శివశంకర ప్రసాద్ చిరంజీవి అసలు పేరు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆయన పేరునే ఇప్పుడు ఈ టైటిల్ గా తీసుకొని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.. మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో అటు అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా గనుక సక్సెస్ అయ్యింది అంటే సుస్మిత నిర్మాతగా మరింత సక్సెస్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

also read:Jayammu nischayammuraa: మీనా ముందు అలాంటి పని చేసిన జగపతి బాబు.. సిగ్గుపడ్డ సిమ్రాన్

Related News

Telugu Web Series: ప్రేమలో తొందరపాటు.. ప్రియుడిని ముక్కలు చేసి డ్రమ్ములో వేసే ప్రియురాలు, కొత్త సీరిస్ సిద్ధం

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు స్పెషల్..!

OTT Movie : టాయిలెట్ కు వెళ్లి తిరిగిరాని లోకాలకు… ఈ మిస్టరీ డెత్ కు వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ రీజన్

OTT Movie : గ్రామంలో ఏ మహిళనూ వదలని దొర… పనోడితో దొర పెళ్ళాం… ఈ అరాచకం మాములుగా ఉండదు భయ్యా

OTT Movie : లాడ్జిలో అమ్మాయి హత్య… మంచానికి చేతులు కట్టేసి ఆ పాడు పని… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సిరీస్ మావా

Big Stories

×