Akkineni Akhil : అక్కినేని ఇంట్లో వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్. తర్వాత వారి పెళ్లి జరిగింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ – జైనాబ్ ఎంగేజ్మెంట్ అయింది. ఆ వెంటనే జూన్ 6వ తేదీన అఖిల్ – జైనాబ్ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అక్కినేని వారి ఇంటి నుంచి మరో శుభవార్త వచ్చినట్టు తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.
అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. నాగ చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో కొంత వరకు హిట్ కొట్టినట్టు అనిపించినా.. అది క్లీన్ హిట్ కాలేదు అని క్రిటిక్స్ అంటారు. ఇదిలా ఉండగా, నాగ చైతన్య.. సమంతతో విడాకులు తీసుకుని శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల తల్లీదండ్రులు అవ్వబోతున్నారని ఇటీవల తెగ వార్తలు వచ్చాయి. శోభిత బేబి బంబ్‌తో కనిపించింది అంటూ కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇదిలా ఉండగా, నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల తల్లీదండ్రులు అవ్వబోతున్నారు అనే న్యూస్ మర్చిపోకముందే మరో వార్త ఇప్పుడు ఇటు ఇండస్ట్రీని, అటు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది ఏంటంటే… జూన్ 6 వ తేదీన పెళ్లి చేసుకున్న అక్కినేని అఖిల్ – జైనాబ్ కూడా తల్లీదండ్రులు కాబోతున్నారట. కాగా, ఈ జంట పెళ్లి చేసుకుని నాలుగు నెలలు అవుతుంది.