Nuzvid IIIT: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ బీటెక్ స్టూడెంట్ ప్రొఫెసర్ పై కత్తితో దాడికి దిగాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. కత్తితో దాడి చేసిన వెంటనే బాధిత ప్రొఫెసర్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ స్టూడెంట్ గత కొన్ని రోజుల నుంచి క్లాసులకు అటెండ్ అవ్వడం లేదు. కాలేజీలకు డుమ్మా కొట్టడంతో ఆ స్టూడెంట్ ను ల్యాబ్ ఎగ్జామ్ రాసేందుకు ఇంచార్జి ప్రొఫెసర్ గోపాల రాజు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ స్టూడెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే కత్తితో ప్రొఫెసర్ గోపాల రాజుపై దాడికి దిగాడు. ఈ దాడిలో ప్రొఫెసర్ కు గాయాలయ్యాయి.
ALSO READ: CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!
గాయపడిన ప్రొఫెసర్ గోపాల రాజును కాలేజీలోని ఇతర ప్రొఫెసర్లు నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొఫెసర్ గోపాల రాజు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్‌పై దాడి చేసిన విద్యార్థిని పోలీసులు వెంటనే పట్టుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ప్రొఫెసర్ పై విద్యార్థి కత్తితో దాడి ఘటనతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉద్రిక్తంగా మారింది. స్టూడెంట్ ప్రవర్తనపై ఇతర ప్రొఫెసర్లు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థల్లో మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.