Chris Gayle : వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇతను బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. గేల్ క్రీజులో ఉంటే.. గ్రౌండ్ లో సిక్సుల మోత మోగాల్సిందే. ఏ క్రికెట్ అయినా.. ఏ బౌలర్ అయినా.. గేల్ వీర బాదుడు బాదేవాడు. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 గెలిచినప్పుడు ఆ ఫైనల్ మ్యాచ్ కి హాజరై ఆర్సీబీ ఆటగాళ్లతో సంబురాలు జరుపుకున్నారు. గేల్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా పంజాబ్ తనను దారుణంగా అవమానించిందని చెప్పాడు. సీనియర్ ఆటగాడైన తనను ఓ చిన్న పిల్లాడిగా ట్రీట్ చేసిందన్నాడు. తనకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిందన్నాడు. ఆ బాధను తట్టుకోలేక తాను అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ముందు ఏడ్చానని తెలిపాడు. అప్పటి పంజాబ్ కెప్టెన్ తనకు అవకాశాలు కూడా ఇవ్వకుండా అవమానించిందన్నాడు.
Also Read : Preity Zinta : ప్రీతి జింటా గొప్ప మనసు… వరద బాధితుల కోసం రంగంలోకి పంజాబ్ టీమ్!
ఇక ఆ బాధను తట్టుకోలేక తాను అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ముందు ఏడ్చానని తెలిపాడు. అప్పటి పంజాబ్ కెప్టెన్ కే.ఎల్.రాహుల్ తనకు ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేసినప్పటికీ తాను సీజన్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయినట్టుగా పేర్కొన్నాడు. వాస్తవానికి క్రిస్ గేల్ ఐపీఎల్ లోకి 2009లో ఎంట్రీ ఇచ్చాడు. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ముఖ్యంగా తన కెరీర్ లో గేల్ 142 మ్యాచ్ లు ఆడాడు. 39.7సగటుతో 4965 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 175 నాటౌట్ గా నిలిచాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటించాడు గేల్. తన కెరీర్ ముగింపు గురించి వెల్లడించాడు. “నిజాయితీగా చెప్పాలంటే పంజాబ్ తో ప్రయాణం ముందే ముగిసింది. అవును నేను చెప్పేది ఏమిటంటే..? పంజాబ్ కింగ్స్ లో తనను అగౌరవపరిచారు. లీగ్ కోసం, పంజాబ్ కోసం ఎంతో చేశాను.. అయినా అగౌరవపరిచారు. లీగ్ కోసం.. పంజాబ్ కోసం ఎంతో చేసిన ఓ సీనియర్ ఆటగాడినైనా నన్ను సరిగ్గా చూసుకోలేదు” అని తెలిపాడు.
మరోవైపు ఆ ఫ్రాంచైజీ ఒత్తిడి కారణంగా తాను మానసికంగా కుంగిపోయినట్టు చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఇప్పటివరకు డిఫ్రెషన్ మోడ్ లో ఉన్నట్టు అనిపించడం తనకు లేదని.. అదే మొదటిసారి అని తెలిపాడు. ఎవరైనా సరే డిప్రెషన్ గురించి మాట్లాడితే తనకు ఆ బాధ ఎలా ఉంటుందో కొంచెం అర్థమవుతుందని తెలిపాడు. ముఖ్యంగా ఆ సమయంలో పంజాబ్ వైఖరీ తనకు నచ్చలేదని.. వీలైనంత త్వరగా జట్టును వీడాలని అనుకున్నట్టు తెలిపాడు గేల్. డబ్బు గురించి అస్సలు దిగులు లేదని.. కానీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని తెలిపాడు. ఈ విషయాన్ని కోచ్ కుంబ్లే కు ఫోన్ చేసి తెలిపినట్టు వెల్లడించాడు. మరోవైపు అదే సమయంలో టీ-20 వరల్డ్ కప్ 2021 ఉండటం.. కరోనా కారణంగా బయో బబుల్ లోనే ఉన్నాం. బయటికీ వెళ్లలేని పరిస్థితి ఉండటంతో మరింత గందరగోళానికి దారి తీసిందని తెలిపాడు గేల్.