Big Stories

Guru Purnima:- ఇతరులను కాళ్లతో తగలకూడదా….

Guru Purnima:- హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి, మనుషులకి కాళ్ళను తగలనివ్వ కూడదని పద్దతి నేర్పిస్తూ ఉంటారు. ఎవరైనా కాళ్లకైనా ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణ చెప్పమంటారు. కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళ కద్దుకోవాలని పిల్లలకు నేర్పిస్తుంటారు.

- Advertisement -

కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?
భారతీయులకు జ్ఞానం, ప్రవిత్రమైందని, దివ్యమైంది. అందువల్లే దానికి ఎప్పుడూ గౌరవంగా చూస్తారు. ఈ రోజుల్లో పాఠాలను ఆధ్యాత్మికం, ఐహికము అని విడదీస్తున్నాం. కానీ పాతకాలంలో ప్రతి విషయం శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే గురువుతో గురుకులాల్లో నేర్పించేవారు. చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారం భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది. చిన్న తనం నుండి ఈ విధంగా పిల్లలకి నేర్పడం వల్ల మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి. జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనం పుస్తకాలని వాహనాలని,పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణం.

- Advertisement -

పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనం ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి. పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు. ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణిస్తారు. ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయంగా పరిగణిస్తారు. అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలోని దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే. అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తి, వినయంతో కూడిన క్షమాపణ చెప్పాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News