Karthika Masam : కార్తీక మాసమంతా తెల్లవారక ముందే పరగడపున లేచి కృత్తికా నక్షత్రము అస్తమించేలో గానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులో లేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో తప్పక తలస్నానమాచరించాలి.అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. పోలి స్వర్గం కార్తీక మాసం:
కార్తీక మాసం చివరి రోజు అమావ్యాస రోజు శివుడికి అభిషేకం విశేష ఫలితం ఉంటుంది.
ఆఖరి రోజు వచ్చే అమావాస్య వెళ్లిన మరుసటిరోజున పోలిస్వర్గం పూజలు చేస్తారు.దీనికి సంబంధించిన కథను పురోహితుల ద్వా రా విని వారికి స్వయంపాకాలు ఇచ్చి అరటి డిప్పలో దీపాలు పెట్టి కాల్వలో గానీ, చెరువులోగానీ వదులు తారు. దాంతోకార్తీక మాసం దీక్షలు పరిసమాప్తి అవుతాయి.
కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేని వాళ్ల, ఇబ్బంది పరిస్థితుల్లో ఆచరించలేక పోయిన వాళ్లు ఈ ఒక్క రోజు చేస్తే కార్తీక మాసం మొత్తం చేసే పూజల పుణ్యం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. పాడ్యమి ఈసారి బుధవారం నవంబర్ 23న వచ్చింది. మహిళలు పాడ్యమి రోజు నదీ స్నానాలు ఆచరించి నెయ్యితో దీపాలు వెలిగించాలి. నీటిలో దీపాన్ని వదిలిన తర్వాత మూడు సార్లు ఆ దీపాన్ని ముందుకూ తోస్తూ నమస్కారం చేసుకుని పోలి కథను వినాలి.
పురాణాల ప్రకారం పోలి అనే మహిళకు కార్తీకమాసంలో దీపారాధన చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడిన తన అత్త కుటిల బుద్ధితో దీప సామాగ్రిని దాచి ఉంచి తను మాత్రమే గుడికి వెళ్లి దీపాలు పెట్టేది.
ఈరోజు ఎవరైతే 30 వత్తులను వెలిగించి నీటిలో వదులుతారో వారికి ఈ నెల మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. నదులు కాలువలు అందుబాటులో లేని వారు ఒక గిన్నెలో నీటిని పోసి తులసి కోట ముందు ఈ దీపాలను వెలిగించి గంగా దేవికి నమస్కరించడం ద్వారా పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.