BigTV English
Advertisement

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

NTR:సాధారణంగా సినిమాలోని పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సరే నటీనటులు ముందుకు రావాల్సిందే. ముఖ్యంగా కొంతమంది సాహసోపేతమైన పాత్రలు చేయడానికి ఇష్టపడితే.. మరికొంతమంది ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఆ పాత్రలు చేస్తారు. ఇంకొంతమంది తమ శరీరాన్ని కూడా పాత్రకు తగ్గట్టుగా మార్చుకొని సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సమయంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నారు? యమదొంగ, కంత్రీ చిత్రాలకు వచ్చేసరికి ఆయన ఎలా ఉన్నారు అనే విషయం ఒక్కసారి గమనిస్తే ఎన్టీఆర్ సినిమాల కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అని అనిపించక మానదు.


ఎన్టీఆర్ డెడికేషన్..

అయితే ఇప్పుడు కూడా ఆర్ఆర్ఆర్ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. ఇటు దేవరా సినిమాలో కూడా కాస్త బరువు ఉన్నట్టుగానే కనిపించారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం ఆయన లుక్ పూర్తిగా మార్చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తన బావమరిది నార్నే నితిన్ పెళ్లిలో ఒక్కసారిగా బక్క చిక్కిపోయి కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో అసలు ఎన్టీఆర్ కి ఏమైంది? ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అంటూ అభిమానులు కూడా కలవరపాటుకు గురయ్యారు. ఇక ఆ తర్వాత అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో గెటప్ కోసం ఎన్టీఆర్ ఇలా తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే?

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో ‘ఎన్టీఆర్ 31 డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారట ఎన్టీఆర్. అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా.. రెండవది కొడుకు పాత్ర. ప్రస్తుతం కొడుకు పాత్రకు సంబంధించిన షూటింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసం ఇలా కొత్త లుక్ ను ఎన్టీఆర్ మైంటైన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ పాత్ర కోసం ఈ ఏడాది ఫిబ్రవరి నుండే ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతున్నారట. ఏది ఏమైనా ఇలా పాత్రల కోసం బాడీ మార్చుకుంటూ అందర్నీ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ డెడికేషన్ కి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే.. అందుకే గ్లోబల్ స్టార్ అయ్యారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.


ALSO READ:Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

ఎన్టీఆర్ కెరియర్

ఎన్టీఆర్ కెరియర్ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఆ తర్వాత నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, ఆది , యమదొంగ, జనతా గ్యారేజ్, ఆర్ఆర్ఆర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు ఈమధ్య పాన్ ఇండియా చిత్రాలుగా తెరకెక్కిస్తూ ఇటు పాన్ ఇండియా వైడ్ మాత్రమే కాకుండా గ్లోబల్ రేంజ్ కూడా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్. ఏది ఏమైనా పాత్రల కోసం తన బాడీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

Related News

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Big Stories

×