శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకుంటే మీకున్న అప్పులు బాధలు తీరిపోతాయని చెబుతారు. ఈ పవిత్ర మాసంలో కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అప్పుడే ఇంట్లో సుఖసంతోషాలు నెరవేరుతాయి. ఈ శ్రావణ మాసంలో సోమవారం, శనివారం, శుక్రవారం అనేవి ఎంతో ముఖ్యమైనవి. శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు. అప్పుడు శివుడే ఈ ప్రపంచాన్ని కాపాడుతాడు. కాబట్టి శివుడిని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు వాటిని త్వరగా తీర్చుకోవాలి. అంటే శ్రావణమాసంలో చేయాల్సిన పనుల గురించి తెలుసుకోండి.
శ్రావణ సోమవారం పరిహారం
శ్రావణమాసంలో వచ్చే సోమవారం ఎంతో పవిత్రమైనది. ఆరోజు శివలింగానికి నీరు, పాలుతో అభిషేకం చేయండి. అలాగే బిల్వపత్రాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల శివుడి ఆశీస్సులు మీకు దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి.
ఈశాన్య మూలలో
ఇంటిలోని ఈశాన్యం మూలను ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచండి. ఈశాన్య దిశలో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడమే కాదు.. సువాసన వీచేలా పువ్వులు, అగరబత్తులు పెట్టడం కూడా మంచిది.
ఇంటిని ప్రతిరోజు గంగాజలంతో పరిశుభ్రంగా చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది. సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇంట్లో వారికి అంతా మంచే జరుగుతుంది.
రావి చెట్టు కింద దీపం
ప్రతి శనివారం శ్రావణమాసంలో రావి చెట్టు కింద దీపం వెలిగించినా కూడా ఉత్తమ ఫలితాలు దక్కుతాయి. ఆవాల నూనెతో లేదా నువ్వుల నూనెతో రావి చెట్టు కింద ప్రతి శనివారం దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి మీరు గట్టెక్కుతారు. చేతికి ఈ సమయానికి డబ్బు అందుతుంది.
శ్రావణమాసంలో వచ్చే సోమవారం శివుడికి తెల్లటి ఆహారాలను లేదా వస్తువులను సమర్పించడానికి ప్రయత్నించండి. ఆ రోజున శివలింగానికి తెల్ల బియ్యము, పెరుగు, పాలు, తెల్లగా ఉండే స్వీటు వంటివి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు.
అలాగే మహా మృత్యుంజయ మంత్రాన్ని శివ చాలీసాను తరచూ పఠిస్తూ ఉండండి. శ్రావణమాసంలో ప్రతి ఉదయం సాయంత్రం శివ చాలీసా చదవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. మీ మనసుకు ప్రశాంతత దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
పేదలకు అవసరమైన ఆహారము, బట్టలు దానం చేయడం మాత్రం మరచిపోకండి. శ్రావణమాసంలో వచ్చే సోమవారము లేదా శనివారము పేదవారికి ఆహారం, బట్టలు, ధాన్యము వంటివి దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా తగ్గుతాయి.
శ్రావణమాసంలో వెండి పాములను కొనండి. ఈ వెండి పాముల జతను మీరు డబ్బులు ఉంచే చోట పెట్టండి. వాటిని పూజించండి. ఇవి సంపదను పెంచుతాయని చెబుతారు. అలాగే అనవసరమైన ఖర్చులను కూడా తగ్గిస్తాయి.