Gowtham Thinnanuri:ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రామ్ చరణ్ (Ram Charan). రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై నడిచి, అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar ) శిష్యుడు బుచ్చిబాబు సన (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. 2026 మార్చి 27వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తో గతంలో సినిమా ఆగిపోవడానికి గల కారణం ఇదే అంటూ ‘కింగ్డమ్’ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) అసలు విషయం చెప్పుకొచ్చారు.
కింగ్డమ్ మూవీతో సక్సెస్ బాట పట్టిన గౌతమ్ తిన్ననూరి..
తెలుగు సినిమా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా పేరు సొంతం చేసుకున్న గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా ఒక సినిమాకు దర్శకత్వం వహించారు. మొదట 2017లో ‘మళ్లీ రావా’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన 2019లో వచ్చిన ‘జెర్సీ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. 2022లో ఇదే టైటిల్ తో హిందీ లో కూడా సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో కింగ్డమ్ సినిమా చేశారు.. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
అందుకే గతంలో రామ్ చరణ్ తో మూవీ ఆగిపోయింది – గౌతమ్
ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్ తిన్ననూరి.. రామ్ చరణ్ తో గతంలో సినిమా ఆగిపోవడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ..” నేను చెప్పిన ఐడియా రామ్ చరణ్ కు బాగా నచ్చింది. కాకపోతే దాని స్క్రిప్ట్ ఆయన ఆశించినట్లుగా రాలేదు. అందుకే ఏదో ఒకటి తీయాలి అని కాకుండా బలమైన కథతోనే మళ్లీ వస్తానని ఆయనకు మాట ఇచ్చాను. అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ ఖచ్చితంగా రామ్ చరణ్ తో ఒక అద్భుతమైన కథను రూపొందిస్తాను” అంటూ గౌతమ్ తిన్ననూరి స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక గొప్ప ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెబుతున్న గౌతం తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తోనే చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక త్వరలోనే రామ్ చరణ్, గౌతం తిన్ననూరి కాంబో మూవీ అనౌన్స్మెంట్ జరగాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
రామ్ చరణ్ కెరియర్..
రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎలా అయినా సరే సక్సెస్ అందుకోవాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే సందీప్ (Sandeep) తో ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెడుతూ.. ఒక సినిమా తర్వాత మరొక సినిమా ప్రకటిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్. అలాంటి ఈయన ఇప్పుడు గౌతం తిన్ననూరి డైరెక్షన్లో సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా మరో స్థాయి అందుకుంటారని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Tollywood: టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా నిలిచిన స్టార్ హీరోలు వీళ్లే!