BigTV English

VEHICLE ACCIDENT : వాహనాలు నడిపేటేప్పుడు జంతువులు చనిపోతే ఏం చేయాలి

VEHICLE ACCIDENT : వాహనాలు నడిపేటేప్పుడు జంతువులు చనిపోతే ఏం చేయాలి


VEHICLE ACCIDENT : ఒక్కోసారి మనం అనుకోకుండానే తప్పు చేస్తాం. కావాలని తెలిసి చేయడం వేరు తెలియకుండానే జరిగిపోవడం వేరు. రోడ్డుపై కారు లేదా సొంత వాహనాల్లో వెళ్తున్నపుడు ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. మన కారుకి ఎదురుగా కుక్క గానీ, పిల్లి కానీ ఎదురుగా రావడం వాటిని వేగంగా గుద్దడం వల్ల అవి వాహనాల కింద పడి నలిగి చనిపోతుంటాయి. వాటిని కాపాడే క్రమంలో కొందరు వాహనాలు పక్కకి తప్పి ప్రమాదాలా బరిన కూడా పడుతుంటారు. ఒక్కోసారి అవి మన వాహనాల కింద పడి చనిపోతుంటాయి. అప్పుడు మనకు దోషం ఏదైనా కలుగుతుందా… వాహనాలకి మనకు ఏదైనా అవుతుందా అన్న సందేహాలు కలుగుతుంటాయి.

దోమల కుడుతున్నాయని దోమల బ్యాట్ వాడుతుంటాం.. బొద్దింకుల్ని ఇంట్లో తిరుగుతుంటే చంపడానికి స్ర్పేలు వాడుతుంటాం. కాబట్టి ఇలాంటి విషయంలో కొంత సాత్వికత ఉంటుంది. మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మాత్రమే వాటిని నివారించే ప్రయత్నం చేయాలి. కానీ మనకు ఇబ్బంది లేకపోయినా వాటిని హింసించి చంపకూడదంటోంది శాస్త్రం. నివారణ ప్రయత్నాలు చేసినప్పుడు మనకు దోషం అంటదని ధర్మ శాస్త్రం చెబుతోంది. టైర్ల కింద కప్పలు, బల్లి, తొండ ఇలాంటివి చనిపోతుంటే… మనకు బాధ కలిగిందంటే వెంటనే స్నానం చేసి ఆ బట్టలు విడిచిపెట్టేయాలి. మళ్లీ వాటిని ధరించకూడదు.


ఘటన జరిగినప్పుడు మనం ఏ బట్టలైతే వేసుకుంటామో పాపం అనే బాధ మనస్సులో కలిగినా, మెదిలినా వెంటనే వాటిపై స్నానం చేసి వాటిని పిండి ఆరవేయాలి . తర్వాత వాటిని అర్హులైన వారికి దానంగా ఇచ్చేయాలి. ఇల్లు మంగళకరంగా ఉండాలంటే ఇలాంటి తప్పు జరిగినప్పుడు సచేల స్నానం చేసి భస్మం ధరించాలి. శరీరం సహకరిస్తే ఆ వేళ ఉపవాసం పాటించాలి. చీకటి పడే వరకు ఉపవాసం పాటించాలి. ఏదైనా పాపం చేశామని మనసులో కలిగితే ఉపవాసం దీక్ష చేయడం ఉత్తమం . ముఖ్యంగా సోమవారం నాడు ఉపవాసం శ్రేయాదాయకం

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×