Rukmini Vasanth:రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) .. కన్నడ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా ప్రముఖ డైరెక్టర్ రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో భారీ అంచనాలతో ‘కాంతార’ సీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ లో నటించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. తాజాగా విడుదలైన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ఏ రేంజ్ లో అయితే నటించారో.. అదే రేంజ్ లో రుక్మిణి వసంత్ కూడా తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసిందనే చెప్పాలి.. ముఖ్యంగా 100కు 200శాతం తన నటనతో చూసే ఆడియన్స్ ను సైతం అబ్బురపరిచింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఒకానొక సందర్భంలో ఏకంగా హీరో ని కూడా ఈమె డామినేట్ చేసింది అంటే.. ఇక తన పాత్రకు ఏ రేంజ్ లో న్యాయం చేసిందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి ఒక అద్భుతమైన నటిని పట్టుకొని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ (Ravi Shankar) కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు వైరల్ గా మారగా.. ఇప్పుడు రుక్మిణి పర్ఫామెన్స్ చూసిన నెటిజన్స్ , అభిమానులు రవిశంకర్ కి కౌంటర్ ఇస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. సెప్టెంబర్ 28న ఆదివారం సాయంత్రం హైదరాబాదులో కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR) ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో మైత్రి మూవీ మేకర్స్ కూడా హాజరయ్యారు.
ఎన్టీఆర్ ప్రతిభకు 80% సరిపోతుందని తీసుకున్నాం – రవిశంకర్
ఈ ఈవెంట్ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. “రుక్మిణి వసంత్ ను కాంతార 2 సినిమాలోనే కాదు.. మా చిత్రం ప్రశాంత్ నీల్ (Prashanth Neel)- ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీలో కూడా ఈమెను ఎంపిక చేసుకున్నాము. నిజానికి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభకు సరిపోయే నటుల కోసం మేము వెతుకుతున్నప్పుడు.. రుక్మిణి వసంత్ కనీసం 80% అయినా ఎన్టీఆర్ ప్రతిభకు సరిపోతుందని ఆశిస్తూ.. ఆమెను ఈ సినిమాలో తీసుకున్నాము” అంటూ ఆమెను కాస్త కించపరుస్తూ రవిశంకర్ కామెంట్లు చేయగా.. ఆ కామెంట్స్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రవిశంకర్ కి కౌంటర్ ఇస్తున్న సినిమా లవర్స్..
ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమా విడుదల అయింది.. ఇందులో రుక్మిణి వసంత్ పెర్ఫార్మన్స్ చూసిన నెటిజన్స్, సినిమా లవర్స్ కూడా రవిశంకర్ పేరును బయటికి తీస్తూ.. “రవిశంకర్ గారూ రుక్మిణి వసంత్ 80% కాదు 180% పెర్ఫార్మన్స్ ఇచ్చింది.. ఇప్పుడు మీ మాటలను వెనక్కి తీసుకుంటారా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఎన్టీఆర్ పై హైప్ తీసుకురావడానికి రుక్మిణి నీ కించపరచాల్సిన అవసరం లేదు.. ఇప్పుడేమంటారు? అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నాడు రుక్మిణిని తక్కువ చేసి రవిశంకర్ మాట్లాడిన మాటలకు ఇప్పుడు కౌంటర్ గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.
ALSO READ:Film industry: ప్రముఖ క్లాసికల్ సింగర్ కన్నుమూత.. ఎలా జరిగిందంటే?
రుక్మిణి వసంత కెరియర్..
రుక్మిణి కెరియర్ విషయానికొస్తే.. బీర్బల్ ట్రైలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని’తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కన్నడ చిత్రం ‘సప్తసాగర దాచే ఎల్లో: సైడ్ ఏ’ అనే కన్నడ చిత్రంతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి : సైడ్ ఏ’ పేరుతో 2023 సెప్టెంబర్ 22న విడుదల చేశారు. తెలుగులో తొలిసారి 2024లో ‘ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఈ ఏడాది ‘మదరాసి’ అంటూ తమిళ్ చిత్రంలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా ఈ సినిమా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా వచ్చేసింది.