Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు గత కొద్ది రోజులుగా కొన్ని కేసుల్లో ఇరుక్కుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మధ్యనే ఓ బిజినెస్ మెన్ నుండి రూ.60 కోట్లు తీసుకుని మోసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ బిజినెస్ మెన్ శిల్పా శెట్టి దంపతులపై కేసు కూడా పెట్టారు. ప్రస్తుతం ఆ బిజినెస్ మెన్ ని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి దంపతులపై కేసు నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇలాంటి సమయంలో రాజ్ కుంద్రా (Raj Kundra), శిల్పా శెట్టి (Shilpa Shetty) ఇద్దరు విదేశాలకు పయనమవ్వడం బీ టౌన్ లో సంచలనంగా మారింది. పైగా వీరి పైన లుకౌట్ నోటీస్ కూడా నమోదైన విషయం తెలిసిందే. అలా కేసు కోర్టులో ఉండగా వీళ్ళు విదేశాలకు ఎలా వెళ్తున్నారు అనే ప్రశ్న ఎదురవుతోంది. మరి విదేశాలకు వెళ్లడానికి వీరు ఏమైనా అనుమతి తీసుకున్నారా ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి రాజ్ కుంద్రా దంపతులపై రీసెంట్గా దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనని బిజినెస్ పేరుతో రూ. 60 కోట్లు మోసం చేశారని చెప్పడంతో వీరిపై కేసు నమోదు అయింది. అలాగే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలకు ఆర్థిక నేరాల విభాగం కింద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఈ నోటీసులపై శిల్పా శెట్టి దంపతుల తరపున వాదించే న్యాయవాది కోర్టుని ఆశ్రయించారు. తమ క్లైంట్ కి జారీ చేసిన ఈ లుకౌట్ నోటీసులను రద్దు చేయాలని శిల్పా శెట్టి దంపతుల తరపున న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో భాగంగా లాయర్ కోర్టులో వీరి గురించి చెబుతూ.. శిల్పా శెట్టి ఒక నటి. అలాగే రాజ్ కుంద్రా ఒక బిజినెస్ మెన్. కాబట్టి వీరు తమ బిజినెస్ కోసం సినిమాల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే..
కానీ లుకౌట్ నోటీసుల వల్ల తమ వృత్తికి ఆటంకం కలుగుతోంది. వీళ్లు ఇద్దరూ కేవలం నిందితులు మాత్రమే.. నేరం రుజువు కాలేదు. కాబట్టి తమ వృత్తిని కొనసాగించుకునే హక్కు వారికి ఉంటుంది. ఈ లుకౌట్ నోటీసుల పేరుతో కోర్టు ఈ జంట వృత్తి అవకాశాలను దూరం చేస్తుందని,ఇలా చేయడం వారి ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని శిల్పా శెట్టి తరపున న్యాయవాది తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా 2026 జనవరి వరకు ఈ లుక్ అవుట్ నోటీసుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.
ALSO READ:Rukmini Vasanth: రవిశంకర్ గారూ.. 80 కాదు 180% పర్ఫామెన్స్ ఇచ్చింది!
కోర్టు నిర్ణయం ఎటువైపు?
అయితే ప్రస్తుతం శిల్పాశెట్టి దంపతులు వేసిన పిటిషన్ కోర్టులో పరిశీలనలో ఉంది. పిటిషన్ కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలోనే వీరు విదేశాలకు ప్లాన్ చేసుకున్నారు. ఒకవేళ కోర్టు అనుమతి ఇవ్వకుండా వీరు విదేశాలకు వెళితే కచ్చితంగా వీరిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి కోర్టు అనుమతి ఇచ్చాకే వీరు విదేశాలకు వెళ్తారా..? లేక కోర్టు పర్మిషన్ లేకుండానే విదేశాలకు వెళ్లి మరిన్ని సమస్యల్లో చిక్కుకుంటారా? అనేది చూడాలి..