BigTV English

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

America News: అమెరికాలోని న్యూయార్క్ సిటీలో లాగ్వార్డియా ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీకున్నాయి. ఈ ఘటనలో ఒక విమానం రెక్క విడిపోయింది. షార్లెట్ నుండి విమానం గ్రౌండ్ నుంచి మూవ్ అవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. మిగతావారి పరిస్థితి గురించి తెలియాల్సివుంది. ఇంతకీ విమానాలు ఎలా ఢీ కొన్నాయి.


ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు

అమెరికా కాలమాన ప్రకారం బుధవారం రాత్రి న్యూయార్క్ సిటీలో లాగ్వార్డియా విమానాశ్రయంలో టాక్సీ నడుపుతున్నప్పుడు రెండు డెల్టా విమానాలు ఒకదాని కొకటి ఢీ కొన్నాయి. ఫలితంగా ఒకదాని నుండి ఒక రెక్క విడిపోయిందని ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటన దాదాపు రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్టు తెలుస్తోంది.


ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్-ATC ఆడియో ప్రకారం.. ఒక విమానం కుడి రెక్క మరొక విమానం ముక్కును ఢీ కొట్టిందని నిర్ధారించింది. విండ్‌ షీల్డ్ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఒకరికి గాయపడినట్టు పైలట్ల మాట. ఒక విమానం రెక్క విరిగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరొక విమానం ముక్కు భాగం బాగా డ్యామేజ్ అయ్యింది.

నెమ్మదిగా వెల్లడమే, లేకుంటే

ఈ ఘటన సమయంలో విమానాలు తక్కువ వేగంతో కదులుతున్నాయి. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కెన్నెడీ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తర్వాత న్యూయార్క్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయం అది.

ALSO READ: ఫిలిప్పీన్స్‌ను వెంటాడుతున్న వరుస భూకంపాలు

ఘటన జరిగిన వెంటనే గ్రౌండ్ సిబ్బంది స్పందించారు. విమానాశ్రయ కార్యకలాపాలకు ఎలాంటి ప్రభావం పడలేదని అమెరికా మీడియా చెప్పింది. ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్-FAA దర్యాప్తు ప్రారంభించింది. ఘటనా స్థలం నుండి తీసిన ఫోటోలు, వీడియోలలో రెండు విమానాలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అత్యవసర వాహనాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనపై డెల్టా ఎయిర్ లైన్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రాథమిక నివేదికల ప్రకారం..  ప్రమాదానికి గురైన విమానాలు డెల్టా విమానాలు DL5047, మరొకటి DL5155.

 

 

Related News

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Big Stories

×