First 3D Printed House: టెక్నాలజీ అనేది కేవలం కమ్యూనికేషన్ వ్యవస్థలోనే కాదు వివిధ రంగాలకు విస్తరించింది. దాని ఫలితంగా పనులు వేగంగా చేయడానికి వీలవుతుంది. దేశంలో తొలిసారి త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇంటి నిర్మాణాలు ఊపందుకోనున్నాయి. సమయం ఆదా కావడమేకాదు, తక్కువ ఖర్చు కూడా. ఆ ఇంటిని కేంద్రమంత్రి పెమ్మసాని బుధవారం ప్రారంభించారు.
దేశంలో తొలి 3డీ ప్రింటెడ్ ఇల్లు
ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోవున్న సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. భారతదేశ గ్రామీణ గృహ రంగంలో ఇదొక మైలురాయి. సాంప్రదాయ పద్దతిలో అత్యాధునిక సాంకేతికతతో ఈ ఇంటిని నిర్మించారు.
భారతదేశంలో మొట్టమొదటి 3D కాంక్రీట్-ప్రింటెడ్ గ్రామీణ ఇంటిని బుధవారం రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రారంభించారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్-PMAY-G కింద నిర్మించింది ఈ నమూనా. రానున్న రోజుల్లో అధునాతన సాంకేతికత, పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించి గ్రామీణ ప్రాంతాల్లో ఆ తరహా ఇల్లు నిర్మాణాలు చేపట్టనుంది కేంద్రం.
కేంద్రమంత్రి చేతుల మీదుగా
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని, దేశ గ్రామీణ గృహ నిర్మాణ రంగంలో దీన్ని మైలురాయిగా వర్ణించారు. సాంప్రదాయ, అత్యాధునిక టెక్నాలజీకి ప్రతి రూపంగా 3 డీ ఇంటిని వర్ణించారు. 3D-ప్రింటెడ్ ఇళ్లు కేవలం సాంకేతికత మాత్రమే కాదు, గృహ నిర్మాణంలో పర్యావరణ బాధ్యత కలిగిన భవిష్యత్తును సూచిస్తాయన్నారు.
ALSO READ: దగ్గుమందు తాగి ఆరుగురు చిన్నారులు మృతి
3 డీ ఇంటి నిర్మాణంలో కాంక్రీటు లేదా ఇలాంటి మెటీరియల్ ను ఉపయోగించి నిర్మాణాలను పొరల వారీగా చేయడానికి రోబోటిక్ లను ఉపయోగిస్తారు. దీని ద్వారా వేగంగా ఇంటి నిర్మాణాలు చేయడానికి వీలవుతుంది. పైగా తక్కువ ఖర్చు కూడా అవుతుంది.
నాలుగేళ్ల కిందట ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్, ఐఐటీ మద్రాసులో దేశంలో మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ ఇంటిని ఆవిష్కరించిన విషయం తెల్సిందే. ఓ స్టార్టప్ ద్వారా దాన్ని అభివృద్ధి చేశారు. నగరాల్లో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు అందించడానికి ఉపయోగపడుతుంది. కాంక్రీటు మిశ్రమాన్ని ఉపయోగించి కేవలం ఐదురోజుల్లో పూర్తి చేయవచ్చని అంటున్నారు.
From Devbhoomi Uttarakhand to every corner of rural India—science is driving dignity and development.
Honoured to inaugurate 🇮🇳’s first 3D Printed Rural House under PMAY at @CSIR_CBRI Roorkee, a beacon of innovation and nation-building.
This milestone brings speed,… pic.twitter.com/2NIiOMBAzO
— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) October 1, 2025