Khammam News: వాహనంతో రోడ్డు మీదకు వెళ్లేటప్పుడు ఇంట్లోవారు పదే పదే జాగ్రత్తలు చెబుతుంటారు. మనం జాగ్రత్తగా వెళ్లినా, వచ్చేవారు ఆ విధంగా రావాలి.. లేకుంటే కష్టమే. తాజాగా ఖమ్మం పట్టణంలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లో తల్లి మృతి చెందింది. ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఖమ్మం పట్టణంలోని మమత రోడ్ ట్యాంక్ బండ్ సమీపంలోవున్న వీవీసీ షోరూమ్ ఎదురుగా ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళ అనుమోలు కిరణ్మయి స్కూటీపై తన ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్ మీదుగా ఇందిరానగర్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మహిళ ప్రయాణిస్తున్న స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
వేగానికి వాహనంపై ఉన్న ముగ్గురు ఎగిరిపడ్డారు. అయితే కిరణ్మయి డివైడర్‌పై పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది. కిరణ్మయి ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చిన్నారులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే కిరణ్మయి ఈ లోకాన్ని విడిచిపెట్టింది. ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టింది. ప్రమాదం తర్వాత పిల్లలు ఇద్దరు లేచిపోయారు.
ALSO READ: లవర్‌తో కలిసి భర్తను చంపేసిన భార్య
ఘటన సమయంలో స్కార్పియో వాహనం ఆ డివైడర్ పక్కనుంచి వెళ్తోంది. పరిసర ప్రాంతాల్లో ఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అతివేగం ప్రమాదకరమని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా, ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దసరా వేళ కిరణ్మయి ఇంట్లో విషాదచాయలు అలముకున్నాయి.
షాకింగ్ విజువల్స్.. డివైడర్‌ను ఢీకొని మహిళ మృతి
ఖమ్మం-మమత రోడ్ ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న VVC షోరూమ్ ఎదురుగా ఘటన
స్కూటీపై తన ఇద్దరు పిల్లలతో కలిసి ట్యాంక్‌బండ్ నుంచి ఇందిరానగర్ వైపు వెళ్తున్న మహిళ అనుమోలు కిరణ్మయి(34)
ఈ క్రమంలో స్కూటీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎగిరి… pic.twitter.com/vkmNwVjGIs
— BIG TV Breaking News (@bigtvtelugu) October 2, 2025