Big Stories

Cockroaches : ఇంట్లో బొద్దింకలు దేనికి సంకేతం…

cockroaches

cockroaches : బొద్దింక దరిద్ర దేవత వాహనం .పూజగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. పూజ గదిలో బొద్దింక దూరింది అంటే మనం శుభ్రంగా ఉంచలేదని అర్ధం. బొద్దింక దరిద్ర దేవత వాహనం అని పెద్దలు చెబుతూ ఉంటారు.పూజగదిలో కానీ, వంట గదిలో కానీ బొద్దింకలు తిరగడం కనిపిస్తే ఇంట్లో నరఘోష పెరుగుతుంది. ఇంట్లో బొద్దింకలు ఉన్న చోట రాక్షసుల ప్రభావం విశేషంగా పెరుగుతుంది .

- Advertisement -

పూజగదిలో ఎప్పటికప్పుడు కొత్త పుష్పాలే ఉంచుకోవాలి. పాతవి ఎప్పటికప్పుడు తొలగించాలి. మందార పువ్వులను అలా వదిలేయడం వల్ల బొద్దింకులు వాటిని వెతుక్కుంటూ వస్తాయి. అది ఇంటికి క్షేమకరం కాదని పండితులు సూచిస్తున్నారు. బొద్దింకలు ఉన్న ఇంట్లో కష్టాలు ఉన్నట్టే..దరిద్ర దేవత వెంటాడుతూనే ఉంటుంది. జేష్టాదేవి యొక్క మొదటి రూపం బొద్దింక. మనం నివసిస్తున్న ఇంట్లోకి దరిద్ర దేవత బొద్దింక రూపంలోనే ప్రవేశిస్తుంది. రాబోయే కష్టాలకి ఇది సూచనగా భావించాలి.

- Advertisement -

మనం నివసిస్తున్న ఇంట్లో బొద్దింకలు ఉన్నాయంటే కష్టాలు, దరిద్రం పెరుగుతున్నట్టే లెక్క. మన వదిలేసిన ఉచ్చస్థితి పదార్ధాలను అవి తినడం వల్ల ఇంట్లో దారిద్ర్యాన్ని పెంచుతాయి. అలాగే పూజ గది మీద ‘లో-రూఫ్’ వేసి అనవసరమైన సామాను వేయడం చాలా మంది చేస్తుంటారు. ఇలా చేయకూడదు. కాబట్టి ఐశ్వర్యం కావాలనుకునే వారు ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలనుకునే వారు గృహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లిపోయి దరిద్రదేవత గజ్జలు కట్టుకుని నాట్యం ఆడుతుంది.

బొద్దింకల ద్వారా ఈ కొలి బ్యాక్టీరియా వస్తుంది. అలానే సాల్మోనెల్లా కూడా ఉంటుంది. బొద్దింకలు ఎక్కువగా ఉన్న పక్షంలో హెపటైటిస్ వంటి వ్యాధులుకూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. బొద్దింకలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడా కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం బేకింగ్ సోడాలో పంచదార మిక్స్ చేసి మిశ్రమంలా చేసుకోవాలి. ఆ తర్వాత బొద్దింక ఉన్న ప్రదేశంలో చల్లాలి. ఇది బొద్దింకలను చంపగలదు. కాబట్టి ఏది ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. దుమ్ము, దూళి దులిపేయండం చేయాలి. అలానే ఎప్పటికప్పుడు ఇల్లుని శుభ్రం చేసుకోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News