E-Paper
Advertisement

WPL : ఆహుజా అదుర్స్.. పరాజయాలకు బ్రేక్.. బెంగళూరు బోణీ..

WPL : ఆహుజా అదుర్స్.. పరాజయాలకు బ్రేక్.. బెంగళూరు బోణీ..
Advertisement

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో ఎట్టికేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణి కొట్టింది. వరుసగా 5 మ్యాచ్ ల్లో ఓడిన స్మృతి మంధాన సేన .. టోర్నిలో తొలి విజయం సాధించింది. ఆరో మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యూపీ జట్టులో గ్రేస్ హారీస్ ( 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 46 రన్స్ ) మాత్రమే మెరుగ్గా ఆడింది. కిరణ్ నవ్ గిరె( 22), దీప్తి శర్మ (22) ఫర్వాలేదనిపించారు. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగతా బ్యాటర్ల విఫలమయ్యారు. దీంతో ప్రత్యర్థి ముందు యూపీ జట్టు 136 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.

బెంగళూరు జట్టు కూడా ఆరంభంలో తడబడింది. 14 పరుగులకే ఓపెనర్లు సోఫియా డివైన్ (14), కెప్టెన్ స్మృతి మంధాన (డకౌట్ ) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఫెర్రీ (10), నైట్ (24) పెవిలియన్ చేరడంతో బెంగళూరు జట్టు 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఓటమి తప్పదా అనిపించింది. అయితే కనికా ఆహూజా( 30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్ తో 46 రన్స్ ) , కీపర్ రిచా ఘోష్ ( 32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సుతో 31 నాటౌట్ ) 5వ వికెట్ కు 60 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. కనికా అవుట్ అయినా శ్రేయాంక పాటిల్ (5 నాటౌట్)తో కలిసి రిచా ఘోష్ జట్టుకు తొలి విజయాన్ని అందించింది. ఫీల్డింగ్ లో 2 క్యాచ్ లు పట్టి, బ్యాటింగ్ లోనూ రాణించిన కనికా ఆహుజాకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

మహిళల ప్రీమియర్ లీగ్ లో.. ముంబై ఆడిన 5 మ్యాచ్ ల్లో గెలిచి టాప్ ప్లేస్ లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4 విజయాలు, ఒక పరాజయంతో రెండోస్థానంలో ఉంది. యూపీ వారియర్స్ రెండు మ్యాచ్ ల్లో గెలిచి.. మరో 3 మ్యాచ్ ల్లో ఓడింది. గుజరాత్ జెయింట్స్ 4 మ్యాచ్ ల్లో ఓడి ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. మొత్తంమీద ముంబై జట్టు వరుస విజయాలతో హాట్ ఫేవరేట్ గా మారింది. ఢిల్లీ జట్టు కూడా రేసులో ముందుంది. గుజరాత్, బెంగళూరు జట్లు వరసగా పరాజయాలతో చివరి స్థానం కోసం పోటీ పడుతున్నాయి.

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×