Big Stories

Shivalinga:- నెయ్యిని వెన్నగా మార్చే శివలింగం ఎక్కడుంది…

Shivalinga:- శ్రీ గంగాధరేశ్వర స్వామీ ఆలయం, కర్ణాటకలోని తుముకూరులో ఉంది. అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం ఈ ఆలయం ప్రత్యేకత. 1600 సంవత్సరాల నుండి ఈ ఆలయంలో జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం. నెయ్యి- అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం కళ్లారూ చూడొచ్చు. తన ఉనికిని పరమేశ్వరుడు చెబుతున్నట్టే ఉండే ధార్మిక దివ్య చైతన్య రహస్యం కనులారా తిలకించే భాగ్యం కలగాలంటే ఈ ఆలయానికి వెళ్లాలి.

- Advertisement -

శివలింగంపై నెయ్యితో అభిషేకం చేసినప్పుడు, నెయ్యి వెన్నగా మారడం అభిషేకం సమయంలో భక్తులు ప్రత్యక్షంగా చూసే వరం. వెన్నగా మారే నెయ్యికి ఔషధ శక్తులు ఉన్నాయని, అనేక రోగాలను నయం చేస్తాయని కూడా భక్తులు విశ్వసిస్తారు. వందల ఏళ్లుగా ఈ అద్భుతం జరుగుతూనే ఉంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాలి. బెంగళూరు నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది , శివగంగే పర్వత శిఖరంపై తుమకూరు నుండి 19 కిలోమీటర్లు 804.8 మీటర్లు ఎత్తులో ఉంది. పవిత్ర పర్వతం శివలింగ ఆకారంలో ఉంది. స్థానికంగా గంగా” అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.

- Advertisement -

శివయ్య కొలువైఉన్న పర్వతం శివలింగాకృతిని పోలి ఉంటుంది. పర్వతం నుండి నిత్యం పారే జలాధార శివయ్య శిరస్సు నుండి జాలువారే గంగమ్మ ను తలపిస్తుంది పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని, సకలపాప హరణమని భక్తులు విశ్వసిస్తారు. అభిషేక సమయంలో పరమేశ్వరునికి సమర్పించే నెయ్యి వెన్నగా మారడం అద్భుతమైన అనుగ్రహం. ఈ శిఖరం పైనే శారదాంబ ఆలయం ఈ ఆలయం ఉంది. అగస్త్య తీర్ధ, కపిల తీర్ధ,కన్వ తీర్ధ,పాతాళ గంగ సరస్సులు ఉన్నాయి.

మకర సంక్రాంతి సందర్భంగా, ఆలయంలో సాయంత్రం సూర్యరశ్మి నంది కొమ్ముల మధ్య ఒక ఆర్క్ గుండా వెళుతుంది . గుహ లోపల ఉన్న లింగంపై నేరుగా పడి లోపలి విగ్రహాన్ని ప్రకాశిస్తుంది. ఈ దృగ్విషయం పురాతన వాస్తుశిల్పుల సాంకేతిక నైపుణ్యానికి చిన్న ఉదాహరణ. ఈ ఆయానికి ఉన్న మరో స్పెషాలిటీ దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే విద్యుత్ శక్తి లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News