Producer OTT SCAM : “మీ కక్కుర్తిలో నా కమాండలం” అని తెలుగులో ఓ పాత సామేత ఉంటుంది. ఇప్పుడు ఓ నిర్మాత చేసిన పనికి ఇలా అనకుండా ఉండలేకపోతున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్లు, ప్రభాస్ లాంటి హీరోలు ఎంతో కష్టపడి తెలుగు చిత్ర సీమ కీర్తి ప్రపంచ పటంపై పడితే.. కాసులకు కక్కుర్తి పడి తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువును మొత్తం తీస్తున్నారు.
నిన్న వెలుగులోకి వచ్చిన ఓటీటీ డీల్ స్కాం వల్ల తెలుగు ఇండస్ట్రీపై బాలీవుడ్ నుంచి మొదలు పెడితే.. ఇతర ఇండస్ట్రీ వాళ్లు కూడా చులకనగా చూస్తున్నారు. చేసిన చిన్న సినిమాకు పెద్ద మొత్తం ఓటీటీ డీల్ అయ్యాలా చేసి.. సదరు ఓటీటీ సంస్థను దాదాపుగా 50 కోట్ల వరకు ముంచేసిన నిర్మాత… మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాడే అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ పరువు తీసేలా ఉన్నాయి.
ఈ వ్యవహారం బయటికి రావడంతో సదరు ఓటీటీ ప్లాట్ ఫాం… ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఓటీటీ డీల్స్ అన్నింటినీ పెండింగ్‌లో పెట్టిందంట. మరీ ముఖ్యంగా తెలుగు భాష సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతుందట. అంతే కాదు… ఇప్పటి వరకు తమ సంస్థలో జరిగిన తెలుగు సినిమాల ఓటీటీ డీల్స్ అన్నింటిపైన మళ్లీ ఆడిట్ చేసే ఆలోచనలో ఉందంట.
అదే జరిగితే.. తెలుగు నిర్మాతలను.. వాళ్లు చేసుకున్న ఒప్పందాలను అన్నింటినీ అనుమానించినిట్టే. అవమానించినట్టే. అది ఆ నిర్మాతలకు మాత్రమే కాదు… ఇప్పుడిప్పుడే ప్రపంచ సినీ పటంలో స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటున్న మన టాలీవుడ్ ఇండస్ట్రీకే పెద్ద మాయని మచ్చ.
ఇదింతా… జరిగింది ఓ నిర్మాత వల్ల అని ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ రావడంతో… మీ కక్కుర్తిలో కమాండలం… TFI పరువు తీస్తున్నారు కదరా.. అని టాలీవుడ్ ఆడియన్స్, తెలుగు సినీ ప్రియులు అంటున్నారు.
ఇలా తెలుగు ఇండస్ట్రీ పరువు మొత్తం తీస్తున్న ఆ నిర్మాత ఎవరో చెప్పండయ్యా అంటూ సినీ లవర్స్ అడుగుతున్నారు. అయితే ఇప్పటికే ఇండస్ట్రీ ఇన్ సైడ్స్ లో ఆ నిర్మాత పేరు వైరల్ అవుతూనే ఉంది. 2022 నుంచి 2024 వరకు మూడు సినిమాలు చేస్తే అందులో మూడు సినిమాల డిజిటల్ రైట్స్ ఆ ఓటీటీ సంస్థకే ఇచ్చాడు. ఆ సంస్థలో ఉన్న ఉద్యోగితో కుమ్ముక్కు అయి… భారీ ధరకు అమ్ముకున్నాడు.
అలాగే ఆ నిర్మాత ఈ మధ్య కాలంలోనే 1.5 కోట్ల రూపాయలతో లగ్జరీ బీఎండబ్యూ కారు కొన్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ మధ్య ఆయన ఓ వివాదం కూడా ఇరుకున్నాడు. తర్వాత సారీ చెప్పి… చేతులుదులుపుకునే ప్రయత్నం చేశాడు. ఆయనే ఈ స్కాంలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకు ఆ ఓటీటీ సంస్థ కానీ, ఆ నిర్మాత గానీ, ఈ స్కాం గురించి, ఆ ఇల్లీగల్ ఓటీటీ డీల్స్ గురించి కానీ, ఎక్కడా బయట మాట్లాడటం లేదు.