BigTV English

IPL : స్టొయినిస్, అవేశ్ ఖాన్ అదుర్స్.. రాజస్థాన్ కు లక్నో షాక్..

IPL : స్టొయినిస్, అవేశ్ ఖాన్ అదుర్స్.. రాజస్థాన్ కు లక్నో షాక్..

IPL : రాజస్థాన్ కు లక్నో షాక్ ఇచ్చింది. లక్ష్య చేధనలో రాయల్స్ తడబడింది. చివరి ఓవర్ వరకు ఆసక్తిగా సాగిన పోరులో లక్నో 10 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ ( 39, 32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు), కైల్ మేయర్స్ ( 51, 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) తొలి వికెట్ కు 82 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. అయితే తొలుత రాహుల్ , ఆ తర్వాత ఆయుష్ బదోని (1), దీపక్ హుడా (2) వెంటనే వెంటనే అవుట్ కావడంతో లక్నో స్కోర్ వేగం తగ్గింది. మార్కస్ స్టొయినిస్ (21), పూరన్ (29) వేగంగా ఆడలేకపోయారు. దీంతో లక్నో భారీ స్కోర్ సాధించలేకపోయింది. రాయస్థాన్ బౌలర్లలో అశ్విన్ కు 2 వికెట్లు, బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ కు తలో వికెట్ దక్కాయి.


155 పరుగుల లక్ష్య చేధనలో రాయస్థాన్ రాయల్స్ ధాటిగా ఇన్నింగ్స్ ను ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (44, 35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), జోస్ బట్లర్ ( 40, 41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు) తొలి వికెట్ కు 87 పరుగులు జోడించారు. 51 బంతుల్లో 68 పరుగులు మాత్రమే చేయాల్సిన సమయంలో జైస్వాల్, కెప్టెన్ సంజు శాంసన్ (2), బట్లర్ వికెట్లను 10 పరుగుల తేడాతో రాజస్థాన్ కోల్పోయింది. హెట్ మయర్ కూడా (2) తక్కువ స్కోర్ కే అవుట్ కావడంతో మ్యాచ్ పై లక్నో పట్టు బిగించింది.

చివరి ఓవర్ వరకు క్రీజులో నిలబడిన దేవదత్ పడిక్కల్ (26), రియాన్ పరాగ్ (15 నాటౌట్) గెలుపు కోసం విఫలయత్నం చేశారు. చివరి ఓవర్ లో విజయానికి 19 పరుగులు చేయాల్సి ఉండగా ఆ ఓవర్ మూడో బంతికి పడిక్కల్, నాలుగో బంతికి జురెల్ అవుట్ కావడంతో రాయల్స్ విజయాకాశాలు దెబ్బతిన్నాయి. అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ లో 8 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో లక్నో 10 పరుగుల తేడాతో గెలిచింది.


లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ కు 3 వికెట్లు , స్టొయినిస్ కు రెండు వికెట్లు దక్కాయి. బ్యాట్ తో విలువైన పరుగులు చేసిన స్టొయినిస్ కే ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

Big Stories

×