BigTV English

Namaskaram : తూర్పు తిరిగి దండం పెట్టాలంటారు ఎందుకుంటే..!

Namaskaram : తూర్పు తిరిగి దండం పెట్టాలంటారు ఎందుకుంటే..!

Namaskaram : మన వస్తువు కాని డబ్బులు కాని పోయాయంటే తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు. ఉత్తరమో, దక్షిణమో తిరిగి దండం పెడితే ఏమవుతుందన్న సందేహం ఉంటుంది. ఎందుకంటే తూర్పు పుణ్యమైన దిక్కు. సూర్యభగవానుడు నుంచి కిరణాలు ప్రసరించే దిక్కు. ఈ కిరణాల నుంచి ఆరోగ్యానికి అవసరమైన శరీర పోషణకు శక్తి లభిస్తుంది. సూర్యదయం చేస్తూ సూర్య నమస్కారం చేస్తే 8 సెకన్లపాటు కిరణాలు మన మేథా చక్రమీద పడుతుంది. అంటే నడి నెత్తమీద. తలమీద శిఖ భాగం సూర్యశక్తిని రిసీజ్ చేసుకుని శరీరంలోని అన్ని భాగాలకు అందిస్తుంది. దీనివల్ల మేధాశక్తి బాగా పనిచేస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఎంత కష్టమైన సమస్య వచ్చినా…సులభం అవుతుంది. అందుకే సూర్యోదయం ప్రాశస్తమైంది.


తూర్పు ఇంద్రుడికి అధిపతి. విఘ్నేశ్వర పూజ. పుణ్యాహవాహనం, సత్యనారాయణస్వామి వత్రం ఇలా ఏదైనా చేసేటప్పుడు తూర్పు వైపున కూర్చునే చేస్తాం. కాని పక్షంలో మాత్రమే ఉత్తర దిక్కు వైపు చేస్తాం. మంచి కోసం చేసే కార్యక్రమాలు అన్నీ తూర్పు వైపునే చేస్తుంటాం. ఇళ్లూ కూడా తూర్పు వాకిలిగా ఉండి, ఈశాన్యంలో సింహద్వారం ఉంటే చాలా మంచిదని, శుభప్రదమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు తూర్పు వైపే ప్రయాణం చేయాలని కూడా అంటారు. మన వెళ్లాల్సిన దిక్కు వేరేదైనా ముందు పది అడుగులు తూర్పు వైపున వేసి తర్వాత దిశ మార్చుకోమని శాస్త్రం చెబుతోంది.

అలాగే శరీరలోని ఏడు చక్రాలను యాక్టివేట్ చేయడమే యోగా అంటారు. ఈ యోగలో అష్టాంగ యోగాలు ఉంటాయి. సూర్యనమస్కారాలు చేయడం వల్ల మంచి విషయాలు తెలుసుకునే శక్తిని కలిగిస్తాయి. అలాగే చెడ్డని తరిమికొట్టే శక్తిని కూడా మేథాచక్రానికి సూర్య కిరణాల నుంచి లభిస్తుంది. తూర్పు తిరగడం వల్ల మనకు మూడు విషయాలు కనిపిస్తుంటాయి. మనసా,వాచ,కర్మణా. మనసులో మనకు సంకల్పం జరుగుతుంది. మేథాచక్రం ఆదేశాల ప్రకారం సంకల్ప సిద్ధి కలుగుతుంది. తూర్పు తిరిగి చూసేటప్పుడు మన శరీరంలోని ఎడమ భాగం అంటే ఈశాన్యం. ముక్కూసూటిగా చూసే స్థానం ఇంద్రస్థానం . కుడిచేతి మూల భాగంలో ఆగ్నేయం అంటే అగ్ని భాగమవుతుంది. ఆ సమయంలో కూర్చునే స్థానం కుభేరస్థానం అవుతుంది. అప్పుడు మనం దేవుడ్ని ప్రార్ధిస్తే చేసే పని మంచిదైతే దేవుడు మనకు అండగా నిలబడి మార్గదర్శిగా మారతాడు.


Tags

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×