BigTV English

Ugadi:చైత్రమాసం ఆరంభంలోనే ఉగాది ఎందుకొస్తుంది?

Ugadi:చైత్రమాసం ఆరంభంలోనే ఉగాది ఎందుకొస్తుంది?

Ugadi:చైత్రం మాసం అంటేనే వసంతఋతువుకు సంబంధించిన మాసం. చైత్ర వైశాఖములకు వేదంలో మధు, మాధవ అని పేర్లు. మధుమాసం అంటే చైత్రమాసం, మాధవమాసం అంటే వైశాఖమాసం. ఈ రెండూ కలిపితే వసంతఋతువు అవుతుంది. ఇది సంవత్సరానికి ఆది ఋతువు, ఆరంభం కూడా ఇదే. వసంత లక్షణాలు ఏంటంటే కొత్తదనం, ఒక తాజాదనం, పచ్చదనం, ఫలాలు ఇలాంటివి అన్నీ లభిస్తుంటాయి. తీవ్రమైన వేడి తీవ్రమైన శీతలంతోపాటు సరియైన సమ వాతావరణం ఉంటుంది. ఇటువంటి శాంతమైన స్థితిని వసంతం అనేది.


సరిగ్గా ఇక్కడే శ్రీరాముడు వసంతఋతువులో పుట్టడమే కాకుండా వసంతంలా వచ్చాడు. అందుకే శ్రీరామ భావనయే ఒక వసంతము. రామధ్యానమే ఒక వసంతము. రామ గానమే ఒక వసంతము. రాముడు మన మనస్సులోకి వస్తే మన మనస్సుకి వసంతం వస్తుంది. వసంతం రాగానే అంతవరకూ శిశిరంలో ఉన్నటువంటి వణికించే చలి, రాలిపోయిన ఆకులు, బీడుతనము, మోడుతనము, అన్నీ పోయి ఒక పచ్చదనం వస్తుంది.

ధర్మము రాలిపోయి ప్రకృతి అంతా క్షోభిస్తూ అసుర శక్తుల వల్ల బాధపడుతూ ఉంటే రామమూర్తి అవతరించి ఆ బాధలన్నీ తొలగించి ఆనంద వసంతాన్ని అందించాడు. అందుకే రామచంద్రమూర్తే వసంత స్వరూపుడు.ఆదర్శగుణమయమైనటువంటి అవతారాన్ని ప్రకటిస్తూ ఉన్నది. రాముడు మానవునికి పరిపూర్ణ ఆదర్శ గుణములన్నీ ప్రకటించిన దివ్యావతారం. మోక్షాన్నిచ్చే తారక స్వరూపుడు. ఇది మరచిపోరాదు. కేవలం మానవునికి ఆదర్శం చూపించే అవతారం అని అనుకుంటే మనం సగం మాత్రమే అర్థం చేసుకున్నట్లు. కానీ రాముడు తారకబ్రహ్మావతారము. అందుకే రామనామానికి తారకనామము, తారకమంత్రము అని పేరు ఉన్నది. రామ తత్త్వమే తారకము.


Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×