Sarfaraz Ahmed: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) ఫైనల్ దాకా వచ్చి దారుణంగా విఫలమైన పాకిస్తాన్ జట్టులో ( Pakistan Team) సమూల మార్పులు చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఉన్న పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ సభ్యులపై వేటు వేసి కొత్తవారిని రంగంలోకి దింపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ గా ఉన్న అకిబ్ జావేద్ ( Aqib Javed ) ను తొలగించి సర్ఫ్‌రాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed ) నియామకం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు కూడా వెలువడుతున్నాయి.
కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ జట్టును కాపాడేందుకు మాజీ క్రికెటర్లు రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దాకా వచ్చి దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ను… మళ్లీ గాడిలో పెట్టేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందట. ఇందులో భాగంగానే చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్న అకిబ్ జావేద్ ( Aqib Javed ) ను తొలగించి… అతని స్థానంలో ఇద్దరు మాజీ క్రికెటర్లను రంగంలోకి దింపుతున్నారు. ఇందులో చీఫ్ సెలెక్టర్ గా సర్ఫ్‌రాజ్ అహ్మద్ ( Sarfaraz Ahmed ) నియామకం చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయట.
అలాగే ఇదే కమిటీలో పాకిస్తాన్ సీనియర్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ ను ( Mohammad Yousuf ) నియమించాలని అనుకుంటున్నారట. బ్యాటింగ్ మెరుగుపరిచేందుకు మహమ్మద్ యూసఫ్ ను ( Mohammad Yousuf ) వాడుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సర్ఫ్‌రాజ్ అహ్మద్ తో పాటు మహమ్మద్ యూసఫ్ కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఫోన్లు కూడా వెళ్లాయట. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board )
ఇచ్చిన ఆఫర్ ను ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు వదులుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ ఇద్దరు బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారట.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్
ఆసియా కప్ 2025 టోర్నమెంటులో… ఇండియా చేతిలో అత్యంత దారుణంగా టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా మొత్తం మూడుసార్లు టీమిండియా చేతిలో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. గ్రూప్ స్టేజ్, సూపర్ ఫోర్ అలాగే ఫైనల్ స్టేజీలలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ లు జరిగాయి. ప్రతి మ్యాచ్ లో కూడా టీమిండియా పై చేయి సాధించి విజయాన్ని అందుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ గెలుస్తుందని ఆశలు వచ్చినప్పటికీ…. తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ దెబ్బకు 9వ సారి ఆసియా కప్ టోర్నమెంట్ గెలుచుకుంది టీం ఇండియా.
🚨Aqib Javed is set to be removed as a chief selector of Pakistan Cricket team.
– Sarfaraz Ahmed is likely to become the new chief selector. Mohammad Yousuf will also be the part of new selection committee. pic.twitter.com/xRPJIu7yiU
— Salman. (@TsMeSalman) October 3, 2025