BigTV English

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Bigg boss emmanuel : ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ కంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. దానిని ఎక్కువ శాతం మంది బయటపెట్టుకోరు. కొన్ని సందర్భాలు వస్తే మాత్రం దానిని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తారు. మనల్ని నవ్వించే ఎంతోమంది కమెడియన్ జీవితాల్లో వేదన,రోదన ఉంటుంది. కానీ అది మనకు ఎక్కువగా కనిపించదు.


జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు క్రేజ్ సంపాదించుకున్న వ్యక్తి ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ కూడా ఒక లవ్ స్టోరీ ఉంది అనేది చాలామందికి తెలియదు. ప్రస్తుతం ఇమ్మానుయేల్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉన్నాడు. ఈ నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో తన లవ్ స్టోరీని మొదటిసారి బయట పెట్టాడు ఇమ్మానుయేల్.

 


తన ముఖం కూడా తెలియదు

బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ కి ‘రాంబో ఇన్ లవ్’ వెబ్ సిరీస్ టీం వచ్చింది. ఈ తరుణంలో తన లవ్ స్టోరీ బయట పెట్టాడు ఇమ్మానుయేల్.

నేను స్టాండ్ అప్ కమెడియన్ గా ట్రై చేస్తున్నాను. బాగా కష్టపడ్డాను. ఎవరు గుర్తుపట్టలేదు. మూడు సంవత్సరాలు పాటు కామెడీ చేస్తూనే ఉన్నాను. అయితే ఒకరు instagram లో చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. ఒక వ్యక్తి ఇంతలా నవ్వించగలడా అని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను. మీ టైమింగ్ చాలా బాగా నచ్చింది. అని ఒక మెసేజ్ వచ్చింది. దానిని నేను చదువుకున్న తర్వాత థాంక్యూ అని మెసేజ్ పెట్టా, మీకు ఓకే అయితే మీ నెంబర్ షేర్ చేస్తారా అని నన్ను తను అడిగింది. నేను నెంబర్ ఇచ్చాను మాట్లాడుకున్నాం.

పెళ్లి చేసుకోవాలి అనుకున్నా

నేను ఇలా డాక్టర్ చదువుకుంటున్నాను అని ఆవిడ చెప్పింది. నేను ఒక డాక్టర్ని నవ్వించగలిగానా అని ఆశ్చర్యపడ్డాను. నాకు అప్పటికి నిజంగా ఫేమ్ లేదు. నన్ను ఇష్టపడేంత గ్లామర్ కూడా లేదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. నేను వారం రోజులు పాటు అమ్మాయి తో మాట్లాడాను. తన ముఖం కూడా నేను చూడలేదు. ప్రపోజ్ కూడా చేయకుండా తనని డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవాలి అని అనిపించింది.

తనకోసమే ఇదంతా..

తను ప్రస్తుతం ఎంబిబిఎస్ సెకండ్ ఇయర్ చదువుతుంది. నేను తనని పెళ్లి చేసుకుంటాను అంటే కొంచెం టైం కావాలి అని అడిగింది. తను నాకు చాలా సందర్భాల్లో ఫోన్ చేసిన కూడా నేను సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. షూటింగ్లో బిజీగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు తన వ్యాల్యూ అర్థమవుతుంది. నాకు పెద్దగా కోరికలు ఏమీ లేవు. నేను బిగ్ బాస్ సీజన్ 9 కప్పు కొట్టి తీసుకెళ్లి తన చేతిలో పెట్టాలి. నాకోసం తన విదేశాలకి వెళ్లాల్సిన చదువు కూడా ఆపేసి ఇక్కడే ఉండిపోయింది.  తనని నేను ముద్దుగా వేస్ట్ ఫెలో అని పిలుచుకుంటా. తనని మొదటిసారి కలిసిన తర్వాతే చచ్చినా బతికిన ఈవిడతోనే అని ఫిక్స్ అయిపోయాను. అంటూ తన లవ్ స్టోరీని బయటకు తీశాడు ఇమ్మానుయేల్. నేను మిమ్మల్ని ఇంత నవ్విస్తాను కానీ రోజు నేను పడుకునేటప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఏడుస్తాను అని ఎమోషనల్ అయిపోయాడు ఇమ్మానుయేల్.

Also Read: Vijay rashmika : మొత్తానికి బయటపడ్డారు, సీక్రెట్ గా విజయ రష్మిక ఎంగేజ్మెంట్

Related News

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg Boss 9: కెప్టెన్సీ కోసం వచ్చిన తిప్పలు, అందరూ కన్నీటి కొళాయిలు ఓపెన్ చేశారు

Bigg Boss 9 Promo2: కళ్యాణ్‌కు రీతూ వెన్నుపోటు.. మళ్లీ కుళాయి ఓపెన్ చేశాడుగా!

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?

Bigg Boss 9 Promo : బాత్రూంలో బోరున ఏడ్చేసిన తనుజ, కళ్యాణ్ చేసింది కరెక్టా?

Bigg Boss 9 Promo: నడుము గిల్లారంటున్న ఇమ్మానుయేల్.. ఇదెక్కడి గొడవ రా బాబు!

Bigg Boss 9 Promo: హిప్పో ఆకలి తీరేనా.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం!

Big Stories

×