Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఒకరి గురించి క్లారిటీ వచ్చే తరుణంలోనే ఇది వీళ్ళ క్యారెక్టర్ కాదు అని నిజస్వరూపాలు కూడా బయటపడుతున్నాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో కళ్యాణ్, రాము రాథోడ్, ఇమ్మానుయేల్, రీతు చౌదరి వీరిలో ఒకరు నాలుగో వారం కెప్టెన్సీకి అర్హులు. అది ఎవరు అని తెలుసుకోవడానికి బిగ్ బాస్ రెయిన్ డాన్స్ అనే టాస్క్ పెట్టారు.
ఈ టాస్క్ లో గెలిచి కెప్టెన్ అవ్వడానికి ఇతర హౌస్ మీట్స్ పైన ఆధార పడాల్సి ఉంటుంది అని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ కు సంచలక్ గా తనుజా ను సెలెక్ట్ చేశారు బిగ్ బాస్. హౌస్ మేట్ పైన ఆధారపడి ఉండాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి. పవన్ రైన్ డాన్స్ చేసిన తర్వాత కళ్యాణ్ ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేద్దాం అని ఫిక్స్ అయ్యాడు. అందువలన కెప్టెన్సీ టాస్క్ నుంచి కళ్యాణ్ తప్పుకోవలసి వచ్చింది.
ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఇమ్మానియేల్ ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేద్దామని నేను ఫిక్స్ అయ్యా అంటూ శ్రీజ చెప్పింది. అందుకే ఇమ్మానుయేల్ తప్పుకున్నాడు. భరణి రీతు చౌదరిని ఎలిమినేట్ చేశాడు.
ఇమ్మానుయేల్ ను శ్రీజ కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసిన తర్వాత, సంజనా ఓదార్చే ప్రయత్నం చేసింది, మరోవైపు రాము రాథోడ్ కూడా ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇమ్మానుయేలు మాత్రం వెళ్ళరా కెప్టెన్ నువ్వు అంటూ తిరిగి పంపించాడు.
రీతు చౌదరి, కళ్యాణ్, ఇమ్మానుయేల్ కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేయబడ్డారు. కాబట్టి 4వ వారం కొత్త కెప్టెన్ గా రాము రాథోడ్ ఎంపిక అయ్యాడు. కెప్టెన్ అయిన తరుణంలో రాము రాథోడ్ ఇమ్మానియేల్ ని కౌగిలించుకొని ఎమోషనల్ అయిపోయాడు. మరోవైపు రీతు కూడా కన్నీళ్లు పెట్టుకుంది. అలానే కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోయినందుకు కళ్యాణ్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దమ్ము శ్రీజ ఓదార్చ ప్రయత్నం చేసింది.
కళ్యాణ్ ను కెప్టెన్సీ అర్హత నుంచి తొలగించడానికి కారణాన్ని పవన్ చెప్పే ప్రయత్నం చేశాడు కానీ కళ్యాణ్ అది వినలేదు. మరోవైపు కళ్యాణ్ రీతూ చౌదరి తో హీటెడ్ ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఈ హిట్ ఆర్గ్యుమెంట్ లో ఎమోషనల్ గా కళ్యాణ్ వెనుక పడి ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది రీతు చౌదరి.
కొత్త కెప్టెన్ రాము రాథోడ్ మాట్లాడుతూ నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి రాబోయే వారం రోజులు కూడా మీ మనసును గెలుచుకుంటా, మనమందరం తప్పకుండా హ్యాపీగా ముందుకు వెళ్దాం అంటూ రాము రాథోడ్ అన్నాడు.
బిగ్ బాస్ లో ఈరోజు ‘రాంబో ఇన్ లవ్’ అనే వెబ్ సిరీస్ టీం ఎంట్రీ ఇచ్చారు. ప్రతి వారం నాలుగు ఎపిసోడ్లు వస్తాయి. హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సిరీస్ వాళ్ళు రోజెస్ ఇచ్చి వాళ్ళ లవ్ స్టోరీస్ చెప్పాలి అని అడిగారు.
ముందుగా చిత్ర హీరో హీరోయిన్ వాళ్ళ లవ్ స్టోరీ చెప్పారు. తరువాత ఇమ్మానుయేల్ తన ఎమోషనల్ లవ్ స్టోరీని బయటపెట్టి ఎమోషనల్ అయిపోయాడు.
Also Read: Vijay rashmika : మొత్తానికి బయటపడ్డారు, సీక్రెట్ గా విజయ రష్మిక ఎంగేజ్మెంట్