Abhishek Sharma Sister Wedding: టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి తెలియని వారు ఉండరు. బ్యాటింగుకు దిగాడు అంటే సిక్సర్లు లేదా బౌండరీలు మాత్రమే కొట్టే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు అభిషేక్ శర్మ. మొన్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో తన తడాఖా ఏంటో చూపించి జట్టును చాంపియన్గా నిలిపాడు. అయితే అలాంటి అభిషేక్ శర్మకు… ఎవరికి రాని సమస్య వచ్చి పడింది. నేషనల్ బ్యూటీ కారణంగా తన సొంత సోదరి పెళ్లికి కూడా వెళ్లలేకపోయాడు అభిషేక్ శర్మ. దీంతో తన సొంత సోదరి పెళ్లిని ( Abhishek Sharma Sister Wedding) వీడియో కాల్ ద్వారా చూసి కొత్తజంటను ఆశీర్వదించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ( Asia Cup 2025 tournament ) మెరిసిన అభిషేక్ శర్మ ( Abhishek Sharma )… తన సొంత సోదరి వివాహానికి కూడా హాజరు కాలేకపోయాడు. టీమిండియా ఏ అలాగే ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య.. ఆన్ అఫీషియల్ వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వన్డే పూర్తికాగా ఇవాళ రెండవ వన్డే నిర్వహించారు. ఈ రెండవ అండ్ అఫీషియల్ వన్డే మ్యాచ్ కాన్పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్కు మొన్న రాత్రి కాన్పూర్ కు వెళ్లాల్సి వచ్చింది అభిషేక్ శర్మ. శుక్రవారం రాత్రి అంటే ఇవాళ… అభిషేక్ శర్మ సోదరి వివాహం జరిగింది. అభిషేక్ శర్మ సోదరి వివాహం అమృత్సర్…లోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో జరిగినట్లు సమాచారం అందుతోంది. అయితే నేషనల్ డ్యూటీలో ఉన్న కారణంగా అభిషేక్ శర్మ ఈ పెళ్లికి హాజరు కాలేదు. కానీ వీడియో కాల్ ద్వారా… పెళ్లిచూసి నూతన వధూవరులను ఆశీర్వదించాడట అభిషేక్ శర్మ. దీనికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ గా మారింది. అభిషేక్ శర్మ కూడా స్టేటస్ పెట్టుకున్నట్లు సమాచారం.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో ( Asia Cup 2025 tournament ) టీమిండియా ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఛాంపియన్ గా నిలవడం వెనక అభిషేక్ శర్మ త్యాగం కచ్చితంగా ఉంది. ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి బౌలర్లకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. అంతేకాదు ఆసియా కప్ 2025 టోర్నమెంటులో 300కు పైగా పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఇందులో భాగంగానే 33 లక్షల విలువైన అరుదైన కారును అభిషేక్ శర్మకు గిఫ్టుగా ఇచ్చారు.
Abhishek Sharma wishing his sister a happy married life through a video call ❤️
– He couldn't attend the function due to India A vs Australia A match. pic.twitter.com/Eivq68XmuT
— Johns. (@CricCrazyJohns) October 3, 2025