BigTV English

Rajnath Singh: సర్ క్రీక్ పై చేయి వేస్తే కరాచీని లేపేస్తాం – రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

Rajnath Singh: సర్ క్రీక్ పై చేయి వేస్తే కరాచీని లేపేస్తాం – రాజ్ నాథ్ సింగ్ వార్నింగ్

దసరా వేళ భారత్ నుంచి పాకిస్తాన్ కి పదునైన హెచ్చరికలు జారీ అవుతున్నాయి. భారత ఆర్మీ చీఫ్ ఆపరేషన్ సిందూర్ 2.ఓని రుచి చూపిస్తామని హెచ్చరిస్తే, ఏకంగా కరాచీని లేపేస్తామంటూ భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ దుస్సాహసానికి బదులుగా రాజ్ నాథ్ ఈ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ పాక్ చేసిన పాడుపని ఏంటి? రాజ్ నాథ్ సింగ్ అంత సీరియస్ గా ఎందుకు రియాక్ట్ అయ్యారు.


షేపులు మారిపోతాయ్ జాగ్రత్త..
భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో సర్ క్రీక్ ఒకటి. ఇది భారత్ లోని గుజరాత్, పాక్ లోని సింధ్ ప్రావిన్స్ మధ్యలో ఉంది. 96 కిలోమీటర్ల పొడవైన టైడల్ నదీ ముఖద్వారం ఇది. ఇది చిత్తడి నేల. ఇక్కడ పహారా కాయడం కూడా కష్టం. అందుకే దీన్ని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తూ ఒప్పందం ఉంది. అయితే ఈ సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు చొచ్చుకు రావాలని చూస్తోంది. అదే జరిగితే పాక్ షేపులు మారిపోతాయని హెచ్చరించారు రాజ్ నాథ్ సింగ్. పాకిస్తాన్‌ భౌగోళిక స్థితి మారిపోవచ్చు అని అన్నారాయన. పాకిస్తాన్ చర్యలకు భారత్ నుంచి నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

దసరా సందర్భంగా..
గుజరాత్‌లోని భుజ్ సమీపంలో దసరా వేడుకలకు హాజరయ్యారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఆయన సర్ క్రీక్ వివాదంపై స్పందించారు. ఇటీవల ఆ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకోసం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ఆ విషయం భారత్ కి తెలిసింది. ఇకపై అలాంటి చర్యలు ఆపేయాలని, అదే కొనసాగితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు రాజ్ నాథ్ సింగ్.


పాక్ ఏం చేస్తోంది..?
సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ దుస్సాహసం మొదలు పెట్టింది. సైన్యం ఉనికిని గణనీయంగా పెంచుకోవాలనుకుంటోంది. మినీ-కంటోన్మెంట్లు, అత్యవసర ఎయిర్‌స్ట్రిప్‌లు, కొత్త క్రీక్ బెటాలియన్లను ఏర్పాటు చేస్తోంది. ఆపరేషన్ సిందూర్‌ లో దెబ్బతిన్న భోలారి ఎయిర్‌బేస్‌ను కూడా పాకిస్తాన్ బలోపేతం చేసుకుంటోంది. దీంతో భారత్ ధీటుగా స్పందించాల్సి వచ్చింది.

Also Read: పాకీలకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

1965 ఘర్షణ..
1965లో భారతదేశం – పాకిస్తాన్ రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలోని సర్ క్రీక్ వద్ద ఘర్షణలకు దిగాయి. దీంతో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోడానికి రెండు దేశాలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి అంగీకరించాయి. ఈ వ్యవహారంపై ఇండో-పాకిస్తాన్ వెస్ట్రన్ బౌండరీ కేస్ ట్రిబ్యునల్ విచారణ జరిపింది. 1968లో తన తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఉత్తర రాన్ ఆఫ్ కచ్‌లో 90 శాతం భూభాగం భారత్ కి వచ్చింది. అయితే ఈ ట్రిబ్యునల్ సర్ క్రీక్‌పై మాత్రం తీర్పు ఇవ్వలేదు. ఉత్తర భాగం భారత్ కి చెందినది అని చెప్పింది కానీ, దక్షిణ భాగంలో ఉన్న సర్ క్రీక్ విషయం తేల్చలేదు. దీంతో అప్పట్నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ అక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుండటంతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.

Also Read: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Related News

Warning To Pakistan: అలా చేస్తే, మ్యాప్‌లో లేకుండా పోతారు.. పాకీలకు ఇండియన్ ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్

Cough Syrup: దగ్గు మందు మరణాలు.. రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

IAF Chief: అవన్నీ కట్టుకథలు.. ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

No Internet: 2 గంటలు ఇంటర్నెట్ బంద్, రోడ్లపైకి పోలీసు బలగాలు.. అసలు ఏం జరుగుతోంది?

Tomato virus: పిల్లల్లో టమాటా వైరస్.. ఇది ఎలా వ్యాప్తి చెందుతోంది? లక్షణాలేమిటీ?

Rajasthan News: రాజస్థాన్‌లో దగ్గు సిరప్ చిచ్చు.. టెస్ట్ చేసిన డాక్టర్‌కి ఏమైంది?

Rabi Crops MSP Hike: పండుగ రోజు రైతులకు గుడ్ న్యూస్.. ఈ ఆరు పంటల మద్దతు ధరలు పెంపు

Big Stories

×