BigTV English

NBK 111: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలయ్య..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

NBK 111: మరోసారి ద్విపాత్రాభినయంలో బాలయ్య..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

NBK: నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల ఈయన డాకు మహారాజ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇక త్వరలోనే ఆఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతో ఘనవిజయం అందుకుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.


వీర సింహారెడ్డితో హిట్ కొట్టిన బాలయ్య..

ఇకపోతే బాలకృష్ణ తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని (Gopichand Malineni)దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి(Veera Simha Reddy) సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి సెన్సేషనల్ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్టు సమాచారం.

NBK 111 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్..

ఇలా రెండు విభిన్న పాత్రలలో బాలయ్య నటించబోతున్న నేపథ్యంలో ఒక పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా బాలకృష్ణను గోపీచంద్ ఎంతో ప్రత్యేకంగా చూపించబోతున్నారని సమాచారం. అలెగ్జాండర్ నుంచి ప్రేరణతో ఈ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సినిమా యాక్షన్ తో కూడిన సోషల్ ఫాంటసీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా అక్టోబర్ 24వ తేదీ ఘనంగా పూజా కార్యక్రమాలను జరుపుకొని NBK 111 వర్కింగ్ టైటిల్ తో రెగ్యులర్ షూటింగ్ పనులను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అఖండ 2 సినిమా షూటింగ్ పనులన్నీ కూడా పూర్తి కావడంతో బాలకృష్ణ వరుస కాల్ షీట్స్ ఇచ్చిన నేపథ్యంలో శర వేగంగా రెగ్యులర్ షూటింగ్ పనులను నిర్వహించడానికి చిత్ర బృందం ప్రణాళికలను వేశారు.


మరోసారి డ్యూయల్ రోల్ లో బాలయ్య…

ఇక ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నట్టు సమాచారం. అయితే ఇదివరకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలకృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించి సందడి చేశారు . తాజాగా ఈ సినిమాలో కూడా రెండు విభిన్న పాత్రలలో బాలకృష్ణ కనిపించబోతున్నారని తెలియగానే అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు. ఏ ఏ నటీనటులు ఈ సినిమాలో భాగం కాబోతున్నారు అనే విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read: MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

Related News

Vijay – Rashmika: సీక్రెట్ గా విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్

MSVPG: చిరంజీవితో ఢీ కొట్టబోతున్న నాని విలన్.. అనిల్ స్కెచ్ మామూలుగా లేదే?

Sreeleela: ఆ సినిమా నుంచి జాన్వీ కపూర్ అవుట్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల!

The Raja Saab: పక్కా ప్లానింగ్ తో ప్రభాస్ మూవీ, మారుతి ది మామూలు స్పీడ్ కాదు

Ramgopal Varma: రిషబ్ శెట్టిను చూసి సిగ్గు తెచ్చుకోండి.. వర్మ సంచలన పోస్ట్!

Mega158 : బాబీ, చిరంజీవి సినిమా కథ గురించి క్లారిటీ ఇచ్చిన తమన్

Rashmika -Vijay Devarakonda: కలిసి దసరా జరుపుకున్న విజయ్ రష్మిక.. రిలేషన్ పై క్లారిటీ ఇవ్వచ్చుగా?

Big Stories

×