E-Paper
Advertisement

Tirumala : శనివారం తిరుమలేశుడికి ఎందుకంత ప్రత్యేకం?

Tirumala : శనివారం తిరుమలేశుడికి ఎందుకంత ప్రత్యేకం?
Advertisement
Tirumala

Tirumala : మనం పూజించే దేవీ దేవతలకు వారంలో నిర్దిష్టమైన రోజున ప్రత్యేక పూజలు, సేవలు చేయటం ఆయా దేవాలయాల్లో మనం చూస్తుంటాం. ఈ క్రమంలోనే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరునికి శనివారం రోజున విశేష సేవలు జరుగుతాయి. అసలు శనివారానికి, తిరుమల శ్రీవారికి ఉన్న అనుబంధం ఏమిటో తెలుసుకుందాం.

ఒక్కో యుగంలో శ్రీ మహావిష్ణువు ఒక్కో అవతారంలో వచ్చి మానవులను కాపాడిన సంగతి మనకు తెలిసిందే. అలాగే.. ఈ కలియుగంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి రూపంలో తిరుమల క్షేత్రంలో కొలువై మానవాళిని కాపాడుతున్నాడు. ‘కలౌ వేంకట నాయకః’ అనే మాట అందుకే వచ్చింది.

Advertisement

ఇక.. ఆయనకు శనివారానికి ఉన్న సంబంధం సంగతికొస్తే.. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వరుడు ప్రవేశించిన రోజు శనివారం. అలాగే ఆయన శ్రీనివాసుడిగా వచ్చి, పద్మావతీ అమ్మవారిని వివాహమాడిన రోజు కూడా శనివారమే.

తిరుమల మీద తనకు ఓ ఆలయాన్ని నిర్మించమని శ్రీనివాసుడు.. తొండమాను చక్రవర్తిని ఆదేశించిన రోజు కూడా శనివారమే కాగా.. తిరుమలలో శిలామూర్తిగా నిలిచిన స్వామిని భక్తులు తొలిసారి గుర్తించి పూజించిన రోజు కూడా ఇదే.

Advertisement

కలియుగంలో శ్రీనివాసుడిని భక్తితో ఆరాధించే వారిని తాను పీడించనని శనీశ్వరుడు శనివారం రోజునే వాగ్దానం చేశాడు. దీనికి రుజువుగా.. శనివారం రోజున సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి తొలి నైవేద్యంగా పచ్చి ఆవుపాలతో బాటు నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. అలాగే.. స్వామివారి సంకల్పంతో ఆయన చక్రం ‘సుదర్శనం’ ఆవిర్భవించిన రోజు కూడా శనివారమే.

పై కారణాల వల్లనే వెంకన్న భక్తులు శనివారం రోజున స్వామి దర్శనానికి పోటెత్తుతుంటారు

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×