కుజ సంచారం రాశి ఫలాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. గత నెలన్నరగా కుజుడు సింహరాశిలో ఉన్నాడు. అదే సింహరాశిలో కేతువు కూడా తిష్ట వేసుకొని కూర్చుని ఉన్నాడు. కుజుడు కేతువుల కలయిక అశుభ సంయోగంగా చెప్పుకుంటారు. అందుకే ఎన్నో రాశుల వారికి ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. అయితే ఈ రోజు అంటే జూలై 28న ఈ సంయోగం ముగిసిపోయింది. అంటే కుజుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల కుజ కేతు అశుభ సంయోగం ముగిసిపోయింది. నాలుగు రాశుల వారికి విపరీతమైన సంపద, ఆనందం కలిగే అవకాశాలు పెరిగాయి. ఏ రాశుల వారికి కుజుడు.. సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వెళ్లడం వల్ల మేలు జరుగుతుందో తెలుసుకోండి.
మేషరాశి
ఈ రాశికి అధిపతి కుజుడు. కాబట్టి కుజ సంచారము మేషరాశి స్థానికులకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. వీరికి కెరీర్ లో గొప్ప ప్రయోజనాలు అందుతాయి. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను తెలివిగా తీసుకుంటారు. తల్లి నుండి ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ.
కర్కాటక రాశి
కుజ గ్రహ సంచారం కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. వారి కెరీర్ లో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు పెండింగ్ ఒప్పందాలు ఈరోజు ఖరారు అయ్యే అవకాశం ఉంది. అలాగే డబ్బు కూడా చేతికి అందుతుంది. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీరు కోరుకున్న ప్రదేశానికి ఉద్యోగరీత్యా వెళ్లే అవకాశం దక్కుతుంది. ఈ సమయం ఆనందంగా గడుస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి అధిపతి కుజుడు. కుజ సంచారం వృశ్చిక రాశి వారికి సంపదను అందిస్తుంది. అలాగే ఉద్యోగంలో, వ్యాపారంలో జీవితంలో ఉన్నత స్థానాన్ని లభించేలా చేస్తుంది. మీ పని మీపై అధికారులకు ఎంతగానో నచ్చుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. డబ్బును ఆదా చేస్తారు. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.
ధనుస్సు
ధనూ రాశి వారికి కుజ సంచారం పాత సమస్యల నుండి బయటపడేలా చేస్తుంది. మీరు ఓడిపోయిన ఒక పనిలో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి వార్తలు మీకు అందుతాయి. మీకు కొత్త ఉద్యోగ ఆఫర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నిండి ఉంటుంది. ధనుస్సు రాశి వారు ప్రస్తుతం శని దైయా ప్రభావంలో ఉన్నారు. ఈ సమయంలో శని వల్ల కలిగే అశుభ ప్రభావాల నుండి మీకు కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.