War 2: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR ) హిందీలో చేస్తున్న తొలి చిత్రం ‘వార్ 2’. వార్ (War) మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా , ఎన్టీఆర్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే జూలై 27వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇకపోతే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న నేపథ్యంలో అటు తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం చేస్తున్నారు.
ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్..
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఆగస్టు 10వ తేదీన చాలా గ్రాండ్గా నిర్వహించనున్నారట. అయితే త్వరలోనే వెన్యూ కూడా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. మొత్తానికైతే ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ చిత్రం కావడం, దీనికి తోడు ఇప్పుడు బాలీవుడ్ తారలంతా ఆంధ్రప్రదేశ్లో సందడి చేయబోతున్నారని తెలిసి అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 సినిమా స్టోరీ..
వార్ 2 సినిమా విషయానికొస్తే.. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా (Adithya Chopra) భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. వార్ – 1 తర్వాత ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) ఇండియాకి రాకుండా విదేశాలలోనే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. దీనికి కారణం.. దేశం కోసం ఎంత కష్టపడ్డా.. తనకు ఎటువంటి గుర్తింపు లేదని.. అందుకే అటు కుటుంబాన్ని, ఇటు దేశాన్ని, మంచి, చెడులను ఆఖరికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని కూడా వదులుకొని విదేశాలలోనే సెటిల్ అయిపోదామని నిర్ణయించుకుంటాడు. అయితే అనూహ్యంగా కబీర్ ని పట్టుకోవడానికి మరో మోస్ట్ వైలెంట్ ఏజెంట్ అయిన విక్రమ్(ఎన్టీఆర్) ను ఇండియా రంగంలోకి దింపుతుంది. అయితే ఇక్కడ నెగటివ్ షేడ్స్ ఉన్న సోల్జర్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలే సినిమాకి హైలెట్ అని సమాచారం.
ఎన్టీఆర్ తదుపరి చిత్రాలు..
అటు ఎన్టీఆర్ తెలుగులో చివరిగా ‘దేవర’ సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా.. ఆ తర్వాత సైలెంట్ గా రూ.600 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు.
ALSO READ:Puja Banerjee: మొదటి రాత్రే కాలరాత్రి.. తొలి వివాహం పై ఊహించని కామెంట్స్ చేసిన పూజా బెనర్జీ!