E-Paper
Advertisement

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!
Advertisement

Ram Lakshman: టాలీవుడ్ సినిమాల ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. స్టార్ హీరోల అందరి సినిమాలకు ఫైట్ మాస్టర్స్ గా వ్యవహరించి ఎన్నో హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఎన్నో వందల సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు ట్విన్ బ్రదర్స్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలన్నింటికీ పని చేశారు. వీరి ఫైట్స్ కు ఎన్నో అవార్డులు , నంది అవార్డులు , రివార్డు లు అందుకున్నారు. . ఇక ఫైట్స్ తో రఫ్ ఆడించడం మాత్రమే కాదు . సాయం కోరి వచ్చిన వారికి సాయం చెయ్యడం చేస్తారు. తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే .. తాజాగా ఈ సినీ ఫైట్ మాస్టర్స్ గొప్ప మనసును చాటుకున్నారు. భారీ కొండరాళ్ల మధ్య చిక్కుకున్న శునకాన్ని రక్షించి అందరి మనసులు గెల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ , ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాస్టర్స్ గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.. రాళ్ళ మధ్యలో ఇరుక్కున్న కుక్కను కాపాడేందుకు ఆ బండరాళ్లను కదిలించడం మనుషులతో సాధ్యం కాదని గుర్తించిన రామ్, లక్ష్మణ్ లు వెంటనే సొంత ఖర్చులతో జేసీబీని పిలిపించారు. దాని సహాయంతో తల్లి కుక్కను కాపాడి బయటకు తీసి దాని పిల్లల చెంతకు చేర్చారు. అంతే కాకుండా వాటికి ఆహారం, నీళ్లు అందించారు.

Advertisement

అనంతరం ఆ కుక్క దగ్గరకు వచ్చి పాలు తాగాయి . అది చూసిన వారంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. కాపాడి పిల్లల దగ్గరకు చేర్చేందుకు రామ్, లక్ష్మణ్ ల పడిన కష్టాన్ని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక పోతే వీరిద్దరూ పలు స్టార్ హీరోల సినిమాలకు ఫైట్ మాస్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ది రాజా సాబ్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు రామ్, లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కోసం మొయినాబాద్ లోని అజీజ్ నగర్ లో రామ్ లక్ష్మణ్ బృందం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈడైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×