E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !
Advertisement

Kissik Talks Show: సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ తెచ్చుకుని, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసే నటీనటులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ‘ఆనందం’ సినిమా హీరోయిన్ రేఖ ఒకరు. ఒకటో నంబర్ కుర్రోడు, దొంగోడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆమె, ఆ తర్వాత వెండితెరకు అకస్మాత్తుగా దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత రేఖ తాజాగా BIG టీవీ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘కిసిక్ టాక్స్’ (Kissik Talks Show) లో సందడి చేసింది హోస్ట్ వర్ష అడిగిన ప్రశ్నలకి తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ ఎమోషనల్ అయింది.. దీనికి సంబంధించిన సరికొత్త ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మనం ఒకటి ప్లాన్ చేస్తే, దేవుడు మరొకటి 

ఆనందం సినిమా విడుదలై ఇన్నేళ్లవుతున్నా, నేటికీ ప్రేక్షకులు తనను ‘ఆనందం రేఖ’గానే గుర్తిస్తున్నారని, ఆ సినిమానే తన లైఫ్ టైమ్ ఐడెంటిటీ అని ఆమె ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది. అయితే, ఇంత మంచి గుర్తింపు వచ్చినా ఇండస్ట్రీకి ఎందుకు దూరమవ్వాల్సి వచ్చిందనే ప్రశ్నకు రేఖ ఎంతో పరిణతితో సమాధానమిచ్చింది.జీవితంలో మనం ఒకటి ప్లాన్ చేస్తే, దేవుడు మరొకటి ప్లాన్ చేస్తాడని, ‘లైఫ్ హాపెన్స్’ అంటూ తన కెరీర్ గ్యాప్‌కు గల కారణాన్ని సున్నితంగా వివరించింది. ఒక ఆర్టిస్ట్‌గా, నటిగా తనకు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ చేయాలని ఉందని, ఇందుకోసం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల మద్దతు, దీవెనలు తనకు ఎంతో అవసరమని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

also read:40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!

ఉదయ్ కిరణ్ తో చేయాల్సిన సినిమాలు 

ఈ క్రమంలోనే తనకి ఎంతగానో పేరు తెచ్చి పెట్టిన ఆనందం సినిమా మొదటగా ఉదయ కిరణ్ చేయాల్సిందని, కానీ అనుకోకుండా అతని స్థానంలోకి ఆకాష్ వచ్చి చేరాడని తెలిపింది.అదే కాకుండా ఉదయ్ కిరణ్ చేసిన కలుసుకోవాలని సినిమాలో మొదటగా తననే అడిగారని, ఆ తర్వాత ఆస్థానంలోకి గజాలా వచ్చి చేరిందని అసలు విషయం చెప్పుకొచ్చింది.అంటే కాకుండా మరో సినిమా కూడా ఇలాగే మిస్ అయిందని, అలా మొత్తంగా మూడు సినిమాలు ఉదయ్ కిరణ్ తో మిస్ అయ్యాయని బాధ పడిపోయింది ఈ వెటరన్ బ్యూటీ.

Advertisement

మనసులోని భావాలను వ్యక్తపరచడం ముఖ్యం

ఈ క్రమంలోనే రేఖ తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన కోణాన్ని కూడా బయటపెట్టింది.ప్రేమ పేరిట జరిగే మోసాలపై స్పందిస్తూ, ఒకరిని నమ్మించి మోసం చేసేవారికి కాలమే సమాధానం చెబుతుందని, ప్రకృతి ప్రతి ఒక్కరి లెక్కలను రాసి పెడుతుందని, మనం చేసిన మోసం ఏదో ఒక రూపంలో రెట్టింపై తిరిగి వస్తుందని పేర్కొంది. నిజమైన ప్రేమ ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుందని, అందులో ఎలాంటి కల్మషం ఉండదని ఆమె అభిప్రాయపడింది. వన్‌సైడ్ లవర్స్‌గా ఉండిపోయే వారి గురించి మాట్లాడుతూ, సరైన సమయంలో మనసులోని భావాలను వ్యక్తపరచడం (ప్రపోజ్ చేయడం) ఎంతో ముఖ్యమని సూచించింది.

also read:పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని స్పష్టం చేసిన రేఖ, తన మనసులోని అసలు వేదనను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయింది.ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో భరించలేనంత బాధ, కన్నీళ్లు ఉంటాయని, ఒక అమ్మాయిగా తన జీవితంలో కూడా తట్టుకోలేనంత పెయిన్ అనుభవించిన రోజులు ఉన్నాయని చెబుతూ ఆవేదన చెందింది. తన జీవితం ఇంతేనేమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, కానీ వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు సరికొత్తగా కెరీర్‌ను టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేఖ ధీమా వ్యక్తం చేసింది. విరామం తర్వాత రేఖ రీఎంట్రీ ఇస్తూ చెప్తున్న ఈ మాటలు ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Related News

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

Big Stories

×