E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..
Advertisement

Kissik Talks Show : బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఈ మధ్య ఎంటర్టైమ్మెంట్ చానల్స్ తో పాటుగా.. న్యూస్ చానల్స్ కూడా కొత్త ప్రోగ్రాంలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ బిగ్ టీవీ సరికొత్త ప్రోగ్రాం కిస్సిక్ టాక్స్ షోను ప్రారంభించింది. ఈ షో కి ఎక్కువగా సెలబ్రిటీలు వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది గెస్ట్ లుగా ఈ షో కి వచ్చి తమ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. జబర్దస్త్ వర్ష యాంకర్ గా వ్యవహరిస్తుంది. తాజాగా కిస్సిక్ టాక్స్ షో కు గెస్టుగా స్నో అక్క మౌనిష వచ్చింది.. డల్లాస్ లో బాగా ఫెమస్ అయిన ఈమె ఇంటర్వ్యూ ఇచ్చింది.. ఈ షోలో ఆమె గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. హీరోయిన్ శ్రీలీల గురించి ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్నో అక్క తన గురించి ఎటువంటి విషయాలను పంచుకుందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

శ్రీలీలతో అలా చెయ్యాలని ఉంది..? 

డల్లాస్ లో బాగా ఫెమస్ అయిన ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్ స్నో అక్క అలియాస్ మౌనిష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అమెరికాలో బాగా ఫేమస్ అయిన ఈమె వీడియోలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. డిఫరెంట్ స్లాంగ్ తో మాట్లాడుతూ స్నో అక్క వీడియోలు చేస్తూ ఉంటుంది. అమెరికాలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలకి ఎక్కువగా ఈమె ప్రమోషన్ చేస్తూ ఉంటుంది.. అలాంటి మౌనిష బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షోకు వచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి ఎన్నో కీలక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో యాంకర్ వర్షా శ్రీలీలకు సైడ్ ఫేసులో మీరు అక్కలాగా ఉన్నారు అని అనగానే దానికి మౌనిష కూడా అవును చాలా మంది అదే అంటున్నారు అని అంటుంది.. అయితే నన్ను శ్రీలీలను పెట్టి ఒక జ్యువెలరీ యాడ్ చేస్తే బాగుంటుంది అని అంటుంది.. తనకి అక్క లాగా నేను ఉంటాను తను నాతో ఏమైంది అక్క అని అడగడం, ఆ తర్వాత నేను జ్యువెలరీ నాకు నచ్చలేదు అని చెప్తాను.. తను ఇలాంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది అని చెప్తుంది.. అలా మా ఇద్దరిని పెట్టి ఎవరైనా డైరెక్టర్ ఈ యాడ్ ని తీస్తే బాగుంటుంది అని తన మనసులోని కోరికను బయటపెట్టింది. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

ఫ్యాషన్ అంటే పిచ్చి.. 

Advertisement

నాకు పెళ్లయిన కొత్తలో నేను ఫ్యాషన్ కి సంబంధించిన ప్రోగ్రాంస్ చేశాను అని తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. డ్రెస్సింగ్ విషయంలో ఈ మధ్య చాలామంది కామెంట్లు చేస్తున్నారు కదా.. మరి దీని గురించి మీరు ఏమంటారు అని వర్షా అడుగుతుంది.. దానికి మౌనిష మన ఫిట్గా ఉంటే ఏదన్నైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు.. డ్రెస్సింగ్ విషయంలో ఎవరిష్టం వాళ్లది.. ఇబ్బంది పడేలాగా ఉండడం కంటే, మనకు నచ్చినట్లు ఉండడం మేలు అని ఆమె ఒక్క మాటలో చెప్పేసింది.. మనకు నచ్చినట్లు మనిష్టమొచ్చినట్లు మనం ఉండాలి పక్కన వాళ్ళ గురించి మనం ఆలోచించవద్దు అని చెప్పింది.. మొత్తానికి ఈ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఈ ఇంటర్వ్యూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆమె కోరికలు విని షాక్ అవుతున్నారు. అంతేకాదు కామెంట్స్ చేస్తున్నారు.. ఈ ఎపిసోడ్ వీడియో ఇక్కడ ఉంది ఒక్కసారి చూసేయ్యండి..

Related News

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Kissik Talks Show : రీతూ అంటే అంత కోపం ఏంటి బ్రో.. ఒక్కమాటతో పరువు తీసేశాడుగా..

Big Stories

×