Shanmukh jaswanth : ప్రముఖ యూట్యూబ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబర్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ కుర్రాడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో జనాలని ఆకట్టుకున్నాడు.. అంతేకాదు హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకోవడంతో వార్తల్లో హైలెట్ అయ్యాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ అలాగే ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉన్న షణ్ముఖ్ఇటీవలే తాను ప్రేమించిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోని ఓ ఇంటివాడు అయ్యాడు.. మూడు రోజుల క్రితం సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.. ఎంగేజ్మెంట్ మాత్రం అంత గ్రాండ్గా చేసుకున్న ఈ కుర్రాడు పెళ్లి ఎందుకు సీక్రెట్ గా చేసుకున్నాడు అన్న ప్రశ్నలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. మరోవైపు షణ్ముఖ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా పెళ్లయిన మూడు రోజులకే అతను ఆసుపత్రిలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. అసలేం జరిగింది ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి కనపరుస్తున్నారు.. అసలు ఈ కొత్త పెళ్లి కొడుకుకి ఏమైంది? ఎందుకు హాస్పిటల్ లో ఉన్నాడు?అన్న విషయాల గురించి ఇప్పుడు మనం కాస్త వివరాలు తెలుసుకుందాం..
యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్, నటుడు షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. వైష్ణవి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. మూడురోజుల క్రితం కుటుంబ సభ్యుల నడుమ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు.. అయితే కేవలం మూడు రోజుల్లోనే అతను ఆసుపత్రి బెడ్ మీద ఉన్నట్లు ఫోటో బయటకు వచ్చింది.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు షణ్ముఖ్ కు ఏమైంది.. ఎందుకు ఆసుపత్రిలో ఉన్నాడు అని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికిస్తున్నారు.. ఆసుపత్రిలో ఉన్నట్లు ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షణ్ముఖ్ స్వయంగా షేర్ చేయడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.. పెళ్లి, రిసెప్షన్ వేడుకల్లో షణ్ముఖ్ బాగా అలిసిపోయాడని, డీ హైడ్రేట్ అవ్వడం, నీరసించడం జరిగి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.. ఏది ఏమైనా దీనిపై క్లారిటీ రావాలంటే అతను నోరు విప్పేవరకు వెయిట్ చెయ్యాల్సిందే…
షణ్ముఖ జస్వంత్ గతంలో దీప్తి సునయనను ప్రేమించిన విషయం తెలిసిందే.. వీరిద్దరూ బిగ్ బాస్ తర్వాత విడిపోయారు.. ఆ తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ బిజీగా మారారు. అయితే రీసెంట్ గా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన షణ్ముఖ్ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.. ఇక కుటుంబ సభ్యుల సమక్షంలో బంధువుల సమక్షంలో రీసెంట్గా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.. వీరిద్దరి పెళ్లికి తిరుపతి వేదికగా మారింది.. అనంతరం వైజాగ్ లో గ్రాండ్గా రిసెప్షన్ ని ఏర్పాటు చేశాడు.. ప్రస్తుతం వీళ్ళిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఇలాంటి టైం లో షణ్ముఖ్ఆసుపత్రిలో ఉండడం పై ఆయన అభిమానులు కూడా చాలా ఫీలవుతున్నారు.. ఏది ఏమైనా కూడా వీరిద్దరి జంట చాలా బాగుంది అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇతను పెళ్లి చేసుకున్నాడు కానీ దీప్తి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ మరో వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ వార్తలపై దీప్తి సునైనా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..