E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Advertisement

Kissik Talks Show : ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ ఎప్పటికప్పుడు జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త ప్రోగ్రాంలను అందిస్తూ ఉంటుంది.. ఈమధ్య ఈ చానల్లో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ప్రసారమవుతున్నాయి.. అందులో ఒకటి కిస్సిక్ టాక్స్. జబర్దస్త్ యాంకర్ వర్షా ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తుంది. అయితే ఈ ప్రోగ్రాం కి ఎక్కువగా సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. తమ గురించి ఎన్నో విషయాలను పంచుకుంటారు. సినిమా ఇండస్ట్రీ గురించి అలాగే సీరియల్స్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.. తాజాగా ఇంస్టాగ్రామ్ఇ న్ఫ్లుయెన్సర్ మౌనిష గెస్టుగా వచ్చింది.. ఈమె తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. అయితే ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొనిందుకే ఇక్కడికి వచ్చింది అంటూ ఓ వార్త ప్రస్తుతం షికారు చేస్తుంది.. మరి దీని గురించి మౌనిష స్నో అక్క ఏం చెప్పిందో కాస్త వివరంగా తెలుసుకుందాం…

బిగ్ బాస్ 10 లోకి స్నో అక్క..

అమెరికాలో ఉంటున్న మౌనిష అలియాస్ స్నో అక్క తన వీడియోస్ తో జనాలని ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన డిఫరెంట్ యాసతో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ కన్నా ఎక్కువగానే ఈమెకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది అంటే మామూలు విషయం కాదు. తన వీడియోలు జనాలకి అంతగా రీచ్ అవ్వడంతోనే ఆమెకు ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారని తెలుస్తుంది. తాజాగా ఈమె బిగ్ టివి నిర్వహించిన కిస్సిక్ టాక్స్ షోకు గెస్టుగా వచ్చింది.. ఈ క్రమంలో రియాలిటీ షోలో పాల్గొంటుంది అని వర్ష అడుగుతుంది.. అందుకే రెండు బ్యాగులు నిండా బట్టలు సర్దుకొని ఇండియాకి వచ్చింది అని ఒక వార్త వినిపిస్తుంది నిజమేనా అని అడుగుతుంది. నాకు గతంలో వైల్డ్ కార్డు ఎంట్రీ కోసమని అప్రోచ్ అయ్యారు.. ఇప్పుడు ఇలా ఆఫర్ వచ్చింది అని చెప్పకనే చెప్పింది స్నో అక్క.. ఇక బిగ్ బాస్ సీజన్ 10 లో ఈమె ఎంట్రీ ఖాయమని దాదాపు కన్ఫామ్ అయిపోయింది.. ఈ షో కి గాను ఈమెకు దాదాపు ఒక రోజుకి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ ఉంటుందని టాక్.. అందులో నిజమేంత ఉందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..

Advertisement

Also Read :Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

బిగ్ బాస్ 10 ఎప్పుడు ప్రారంభం కాబోతుంది..?

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే 10 వ సీజన్ ను ప్రారంభించబోతుంది.. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇప్పటికే ఈ షోలో కంటెస్టెంట్లు వీళ్లే అంటూ అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో తమిళ నటి కస్తూరి శంకర్ కూడా కంటెస్టెంట్ గా రాబోతుంది అని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. అయితే ఈసారి సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలకు కూడా అగ్ని పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు గానీ త్వరలోనే ఈ షో గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది..

Advertisement

Related News

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Kissik Talks Show: ఒకే ఒక్క రీల్‌తో ఓవర్‌నైట్ స్టార్.. నా టైం వచ్చింది అంటూ ‘స్నో అక్క’ మౌనిష సెన్సేషనల్ కామెంట్స్!

Kissik Talks Show :హీరోయిన్ అవ్వాలంటే బాడీ మెజర్మెంట్స్ కావాలా? స్నో అక్క’ మౌనిష కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ వైరల్!

ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

BigTv Kissik Talks : కళ్యాణ్ జీవితంలో ఊహించని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Big Stories

×