Kissik Talks Show: BIG టీవీ ప్రతిష్టాత్మక టాక్ షో ‘కిసిక్ టాక్స్’ (Kissik Talks Show) సరికొత్త ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తోంది. క్రేజీ హోస్ట్ వర్ష యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో రీసెంట్ ఎపిసోడ్‌లో ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీ, కంటెంట్ క్రియేటర్ మౌనిష గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.. సాధారణంగా ఇంటర్వ్యూలు అంటే కేవలం సినిమా ముచ్చట్లే ఉంటాయి. కానీ, ఈ ఇంటర్వ్యూలో మౌనిష తన పర్సనల్ లైఫ్, ఫిట్‌నెస్ సీక్రెట్స్, అమెరికా లైఫ్ స్టైల్ మరియు టాలీవుడ్ స్టార్ హీరోలతో తనకు ఉన్న బాండింగ్ గురించి షేర్ చేసుకున్న విషయాలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
హోస్ట్ వర్ష అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను దాదాపు ఆరేళ్ల తర్వాత ఇండియాకు తిరిగి వచ్చినట్లు మౌనిష పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పుడు రెగ్యులర్ జిమ్ వర్కవుట్స్‌తో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేదాన్నని, కానీ ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడి రుచులను అస్సలు తట్టుకోలేకపోయానని నవ్వుతూ చెప్పారు. “మా ఇండియా వస్తే ఫుడ్ ఆపుకోవడం ఎవరికైనా కష్టమే. అందుకే డైట్ పక్కన పెట్టేసి ఫుల్ తినేస్తున్నా. వన్ మంతలోనే ఏకంగా 5 కేజీల బరువు పెరిగాను” అంటూ మౌనిష చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
చాలా మంది సెలబ్రిటీలు బరువు పెరుగుతామనే భయంతో స్వీట్లకు, కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటారు. కానీ మౌనిష రూటే సెపరేట్. తనకు షుగర్స్, స్వీట్స్, బ్రౌనీలు, చాక్లెట్లు అంటే అమితమైన ఇష్టమని, రోజంతా అవే తింటూ ఉంటానని, ఎప్పుడో ఒకసారి మాత్రమే అన్నం తింటానని స్పష్టం చేశారు. లావు అయిపోతామనే రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం తనకు నచ్చదని తెలిపారు. అయితే, ఇంత తిన్నా యాక్టివ్‌గా ఎలా ఉంటారనే దానికి సమాధానంగా.. “వారంలో 3 నుండి 4 సార్లు ఖచ్చితంగా జిమ్‌కు వెళ్తాను. ఇంట్లో పనులన్నీ నేనే స్వయంగా చూసుకుంటాను. గ్రోసరీ షాపింగ్, వంట చేయడంతో పాటు మాకున్న రెండు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్తాను. లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం. ఇలా రోజంతా నన్ను నేను బిజీగా ఉంచుకోవడమే నా ఎనర్జీ సీక్రెట్” అని వివరించారు.
ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం ఫన్ పర్పస్ కోసమే స్టార్ట్ చేసిన మౌనిష.. ఈరోజు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు, హీరోలను ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎలా ఎదిగారనే సస్పెన్స్‌ను కూడా రివీల్ చేశారు. మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్స్ అమెరికాలోని డ్యాలస్‌లో జరిగినప్పుడు, విరానికా మంచు గారు తనను స్పెషల్ గెస్ట్‌గా ఇన్వైట్ చేశారని తెలిపారు. అక్కడి నుంచే తన ఇంటర్వ్యూల ప్రయాణం మొదలైందని, ఇప్పుడు ఏ పెద్ద సినిమా రిలీజ్ ఉన్నా తమ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రావడం ఒక ట్రెండ్‌గా మారిపోయిందని,సినిమా రిలీజ్ కావాలంటే బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చింది మౌనిష .
ఇక ఇప్పటివరకు ఎంతమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేశారనే దానికి కౌంట్ లేదన్న మౌనిష, రీసెంట్‌గా రానా దగ్గుబాటి, అడవి శేష్, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్స్‌తో కంటెంట్ జనరేట్ చేసినట్లు గుర్తుచేశారు. ముఖ్యంగా ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టితో లైవ్‌లో తాను చెప్పిన ఒక క్రేజీ డైలాగ్ మరియు ‘కిసిక్ టాక్స్’ మూమెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. వర్ష హోస్టింగ్ టైమింగ్, మౌనిష బబ్లీ మాటలు కలగలిసిన ఈ పూర్తి ఎపిసోడ్ ప్రస్తుతం యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వ్యూస్ ల వర్షం కురిపిస్తుంది.