Singer Chinmayi.. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా అందరిని ఆశ్చర్యపరిస్తే.. నేడు తెలంగాణ రాజకీయాలు సినీ సెలబ్రిటీలలో కూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ను ఇంకొకరితో జతకడుతూ చేసిన అనుచిత వ్యాఖ్యలు నీచమని , హేయంగా ఈమె మాట్లాడిందని సెలబ్రిటీలు కూడా మండిపడుతూ వరుసగా పోస్టులు పెడుతూ మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సమంత – నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్..
కేటీఆర్ తో ఈమెకు ఉన్న విభేదాల కారణంగా సినీ సెలబ్రిటీలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. తాజాగా బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ.. సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ , ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటున్నారు. దీనికి కూడా కారణం కేటీఆర్. మత్తుకు బానిస అయ్యి తనతో పాటు హీరోయిన్లను కూడా మత్తుకు బానిస చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ జీవితాలను నాశనం చేస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది.
సమంత పై నీచమైన కామెంట్లు చేసిన కొండా సురేఖ..
అక్కడితో ఆగకుండా ప్రస్తుతం హైడ్రా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసింది. గతంలోనే ఈ హాల్ కూల్చివేత ప్రస్తావనకు వచ్చినా నాగార్జునతో కేటీఆర్ సమంతను నా దగ్గరకు పంపు లేదంటే ఎం కన్వెన్షన్ హాల్ కూల్చివేస్తానని బెదిరించాడు. దాంతో నాగార్జున సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించే ప్రయత్నం చేయగా.. సమంత తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అందుకే నాగచైతన్య సమంతకి విడాకులు ఇప్పించారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై మండిపడుతూ పోస్ట్ కూడా పెట్టారు నాగార్జున.
కొండా సురేఖ తీరుపై మండిపడ్డ నాగార్జున..
గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, మీ ప్రత్యర్ధులను విమర్శించడానికి మీరు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను కూడా మీరు గౌరవించండి. మీరు మా కుటుంబం పట్ల చేసినవన్నీ ఆరోపణలు, పచ్చి అబద్దాలు. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ ట్విట్టర్ వేదికగా నాగార్జున తెలిపారు.
సిగ్గులేని రాజకీయాలు అంటూ ప్రకాష్ రాజ్ ఫైర్..
ఇక నాగార్జున కంటే ముందే ప్రకాష్ రాజ్ స్పందించిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ డైరెక్ట్ గా కొండా సురేఖకు ట్వీట్ వేస్తూ.. ఏంటి సిగ్గులేని రాజకీయాలు. సినీ ఆడవాళ్లంటే అంత చులకనా.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ఆయన కూడా పోస్ట్ పెట్టారు.
మైలేజ్ కోసమే సమంత పేరు వాడుకుంటున్నారు – చిన్మయి
అయితే ఇప్పుడు ఈ విషయంపై సమంత స్నేహితురాలు ప్రముఖ సింగర్ చిన్మయి కూడా మండిపడ్డారు. చిన్మయి మాట్లాడుతూ.. కొంతమంది తమ పాపులారిటీని పెంచుకోవడం కోసం సమంత పేరును వాడుకుంటున్నారు అంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానల్స్ ,మీడియా సంస్థల తీరును కూడా ఆమె తప్పు పట్టారు. వ్యూస్ , లైక్స్ , డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమని, ముఖ్యంగా ఒక మంత్రి ఇలాంటి కామెంట్లు చేయడం నీచం అంటూ సమంతకు సపోర్టుగా కొండా సురేఖ పై చిన్మయి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చిన్మయి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.
End of the day all it proves is that…
— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024