BigTV English

Sankranthi 2026 Releases : సంక్రాంతికి సినిమాలు సెట్, పాపం రాజుగారి పరిస్థితి ఏంటి?

Sankranthi 2026 Releases : సంక్రాంతికి సినిమాలు సెట్, పాపం రాజుగారి పరిస్థితి ఏంటి?

Sankranthi 2026 Releases : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం దిల్ రాజు టైం సరిగ్గా వర్కౌట్ కావట్లేదు అని చెప్పాలి. ఒకప్పుడు దిల్ రాజు సినిమా చేస్తున్నారు అంటే అది మినిమం గ్యారంటీ ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత దిల్ రాజుకి ఉంది. ప్రతి సంక్రాంతికి కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా విడుదల అవుతూనే ఉంటుంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది.


మామూలు రోజుల్లో కంటే సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. కొంచెం యావరేజ్ డాకు వస్తే చాలు అద్భుతమైన కలెక్షన్లు వస్తాయి. అలానే వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. గత ఏడాది హనుమాన్ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఈ సంక్రాంతికి కూడా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

దిల్ రాజు సినిమా లేదు 


ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుండి ఒక సినిమా విడుదలవుతూ వస్తుంది. పెద్ద పెద్ద సినిమాల మధ్య కూడా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాల తర్వాత విడుదలైంది శతమానం భవతి. ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఎప్పుడు సినిమా ఉన్నా లేకపోయినా సంక్రాంతికి మాత్రం దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా ఉంటుంది.

అయితే 2026 సంక్రాంతికి సంబంధించి దిల్ రాజు సినిమా ఒకటి కూడా రావట్లేదు. ఈ ఏడాది వచ్చిన గేమ్ చేంజర్ తీవ్రమైన నష్టాలు తీసుకొచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొంతమేరకు వాటిని పూడ్చి పెట్టింది. 2026 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి దిల్ రాజు దగ్గర ప్రస్తుతం ఒక సినిమా కూడా లేదు. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు.

సంక్రాంతి సినిమాలు సెట్ 

2026 సంక్రాంతి సంబంధించి రిలీజ్ కావలసిన సినిమాలు ఇప్పటికే సెట్ అయిపోయాయి. జనవరి 9 వ తారీఖున ది రాజా సాబ్ సినిమా విడుదలవుతుంది. అలానే జనవరి 11న మన శంకర వరప్రసాద్ సినిమా విడుదల కానుంది. జనవరి 14న నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుద్ది అని అందరికీ విపరీతమైన నమ్మకం. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రానున్న రవితేజ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక ఏ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలబడుతుందో వేచి చూడాలి.

Also Read: Janhvi Kapoor: శ్రీదేవి నటించిన సినిమాలలో జాన్వీకి ఆ సినిమాలంటే అంత ఇష్టమా?

Related News

Akhanda 2: ఇట్స్ అఫీసియల్… పోటీ నుంచి తప్పుకున్న బాలయ్య… ఇక ఓజీ ఒంటరిగానే

S.V.Krishna Reddy: వేదవ్యాస్ గా రాబోతున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. హీరోయిన్ గా కొరియన్ నటి

Dil Raju : రాజుగారిని ఆదుకోవాలంటే… ప్రతి సారి పవనేశ్వరుడే రావాలా ?

Maniratnam: అప్పుల బాధతో మణిరత్నం సోదరుడు మృతి.. 23 ఏళ్ల తర్వాత తీర్పునిచ్చిన హైకోర్టు

Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు

Kingdom OTT: ఇక్కడ కూడా అభిమానులకు నిరాశే..

Big Stories

×