Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టిన దిల్ రాజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ లో దిల్ రాజుకి విపరీతమైన ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే వాటిని తట్టుకొని అలాగే నిలబడి ఇండస్ట్రీలో ఒక ప్రముఖ స్థానాన్ని సాధించుకున్నారు. అప్పట్లో నిర్మాతలు ఎలా అయితే మంచి పేరు సాధించుకున్నారు. ఈ తరంలో దిల్ రాజుకి అంతటి మంచి పేరు లభించింది.
మణిరత్నం తీసిన అమృత సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేశారు దిల్ రాజు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీ బంతి కింద పడింది అంటే అది అంతే ఫోర్స్ తో పైకి లేస్తుంది అంటూ ఇన్స్పైర్ చేశారు. అతను చెప్పిన మాదిరిగానే దిల్ రాజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అద్భుతమైన సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసి మంచి లాభాలను సాధించుకున్నారు.
మళ్లీ పవన్ కళ్యాణ్ ఆధారం
ఇక ప్రస్తుతం దిల్ రాజు పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ సినిమా భారీ డిజాస్టర్ అయిపోయింది. శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. కానీ ఆ అంచనాలను మినిమం అందుకోలేకపోయింది ఆ సినిమా. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొంతమేర లాభాలను తీసుకొచ్చి పెట్టింది. ఇక రీసెంట్‌గా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన తమ్ముడు సినిమా కూడా డిజాస్టర్ అయింది.
ఇప్పుడు దిల్ రాజు పరిస్థితి ఆర్థికంగా ఆ స్థాయిలో లేదు అని చెప్పాలి. అద్భుతమైన హిట్ సినిమా పడితే గాని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వని పరిస్థితి. అయితే ఒకప్పుడు దిల్ రాజుకి డిస్ట్రిబ్యూషన్ లో నష్టం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాను రీ రిలీజ్ చేసే వాళ్ళు. అలా రెండు మూడు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ సినిమాను రీ రిలీజ్ చేశారు.
ఇప్పుడు దిల్ రాజు మళ్ళీ అదే ప్లాన్ వేస్తున్నారు. ఈసారి రీ రిలీజ్ కాకుండా మంచి హైప్ ఉన్న సినిమా నైజాం రైట్స్ తీసుకున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమా డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు చేస్తున్నారు. ఈ సినిమాతో దిల్ రాజుకు మంచి లాభాలు వస్తాయి అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
కంటెంట్ ఆకట్టుకుంటుంది
ఓజి సినిమాకు సంబంధించి విడుదలైన కంటెంట్ కు మాత్రం భారీ హైప్ వచ్చింది. సినిమా నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదలయ్యాయి. ఈ రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా మీద కూడా నమ్మకాలు మరింత పెరిగిపోయాయి.
Also Read: Om Raut: ఇదేం కర్మ రా బాబు, సినిమా వచ్చి వెళ్లిపోయిన ఈ దర్శకుడికి తిట్లు మాత్రం తప్పట్లేదు