Sreemukhi: తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లుగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ యాంకర్స్ అంటే అందరికీ మొదట సుమ కనకాల పేరు గుర్తుకు వస్తుంది అయితే సుమ తర్వాత అదే స్థాయిలో సక్సెస్ అందుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. పటాస్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా పరిచయమైన శ్రీముఖి(Sreemukhi) అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా కెరియర్ మొదట్లో సినిమాలలో కూడా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వెండితెర పై పెద్దగా సక్సెస్ అందుకోని ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై మాత్రం తన మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ యాంకర్ గా సక్సెస్ అయ్యారు.
సీరియల్ నటుడి ప్రేమలో శ్రీముఖి ?
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా కొన్ని క్యూట్ గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రీముఖి ప్రేమ గురించి వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఇటీవల కాలంలో శ్రీముఖి ప్రేమ పెళ్లి వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ మా లో ప్రసారం అవుతున్న స్టార్ మా పరివారం కార్యక్రమంలో బుల్లితెర నటీనటులు పాల్గొంటారు. అయితే గుండె నిండా గుడి గంటలు సీరియల్ నటుడు బాలు (విష్ణు కాంత్) శ్రీముఖి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా వేదికపైనే ఈమె తనకు ప్రపోజ్ చేయడం తన ఇంట్లో వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ బాలు చెప్పడంతో వీరి ప్రేమ, పెళ్లి గురించి తరచూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
బి అంటే..బాలునా శ్రీముఖి?
ఇకపోతే తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం తన నెయిల్ పాలిష్(Nail Polish) పై బి అనే అక్షరాన్ని డిజైన్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తున్న శ్రీముఖి బిగ్ బాస్ అగ్ని పరీక్ష (Bigg Boss Agnipariksha)స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్ స్టార్ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈమె నెయిల్ పాలిష్ పై B అనే లెటర్ ఉండటంతో శ్రీముఖి బిగ్ బాస్ గురించి తెలియజేస్తూ.. బి అనే అక్షరాన్ని డిజైన్ చేయించుకోలేదని, బి అంటే బాలు(Balu) అనే ఉద్దేశంతోనే ఇలా నెయిల్ పాలిష్ డిజైన్ చేయించుకున్నారు అంటూ ఈ ఫోటోలపై నెటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు.
ఇలా శ్రీముఖి నెయిల్ పాలిష్ ద్వారా మరోసారి తన బాయ్ ఫ్రెండ్ గురించి పరోక్షంగా చెబుతున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ మా నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా బాలు స్వయంగా శ్రీముఖి కోసం తన చేతులతో తయారు చేసిన చీరను కానుకగా అందించడంతో వీరి ప్రేమ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. నిజంగానే బాలు శ్రీముఖి ప్రేమలో ఉన్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మ తర్వాత తాను మొదటిసారి శ్రీముఖి కోసమే చీర నేసానని చెప్పడంతో మరోసారి వీరి ప్రేమ వ్యవహరం చర్చలకు కారణమైంది.
Also Read: Janhvi Kapoor: శ్రీదేవి నటించిన సినిమాలలో జాన్వీకి ఆ సినిమాలంటే అంత ఇష్టమా?